News August 27, 2024
ఇవాళే జైలు నుంచి కవిత విడుదల!

TG: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టు <<13949913>>బెయిల్ <<>>మంజూరు చేయడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ సాయంత్రంలోపు తిహార్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. ధర్మాసనం తీర్పు పత్రాలను ఆమె తరఫు లాయర్లు వెంటనే జైలు అధికారులకు అందించనున్నారు. కవితకు ఘన స్వాగతం పలికేందుకు కేటీఆర్, హరీశ్ రావుతోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న విషయం తెలిసిందే.
Similar News
News August 31, 2025
పోలవరం కొట్టుకుపోయినా NDSA ఎందుకు పట్టించుకోవట్లేదు: హరీశ్

TG: పోలవరం ప్రాజెక్టు 10 సార్లు కొట్టుకుపోయినా NDSA ఎందుకు విచారణ జరపడం లేదని హరీశ్ రావు అసెంబ్లీలో ప్రశ్నించారు. ‘2019-25 వరకు పోలవరం డయాఫ్రమ్ వాల్, గైడ్‌బండ్, కాఫర్ డ్యామ్.. కొట్టుకుపోయాయి. రిపేర్‌కు రూ.7 వేల కోట్లు అవుతుంది. ఆ సమయంలో పోలవరం చీఫ్ ఇంజినీర్‌గా ఉన్న చంద్రశేఖర్ అయ్యర్ మేడిగడ్డపై రిపోర్ట్ ఇస్తారా. NDSAకు నచ్చితే ఒక నీతి.. నచ్చకుంటే ఒక నీతి ఉంటుందా’ అని నిలదీశారు.
News August 31, 2025
చికెన్ తిని అలాగే పడుకుంటున్నారా?

రాత్రి పూట చికెన్ తిన్న తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ‘పడుకునే ముందు చికెన్ తింటే సరిగ్గా జీర్ణం కాదు. గుండెలో మంట, కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ సమస్యలు తలెత్తుతాయి. నిద్రకు అంతరాయం కలుగుతుంది. కొవ్వు పేరుకుపోయి బరువు పెరగడానికి దారి తీస్తుంది. రక్తపోటు, డయాబెటిస్‌కు కూడా దారి తీసే ఛాన్స్ ఉంది. తిన్న 2-3 గంటల తర్వాత నిద్ర పోవడం ఉత్తమం’ అని నిపుణులు అంటున్నారు.
News August 31, 2025
VIRAL: ఒకటో తరగతికి రూ.8,35,000 ఫీజు

బెంగళూరులోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో పిల్లల ఫీజులు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఏడాదికి 1-5 తరగతులకు రూ.7.35 లక్షలు, 6-8కి రూ.7.75 లక్షలు, 9-10 క్లాసులకు రూ.8.50 లక్షల ఫీజు అని ఆ స్కూల్ పేర్కొంది. రెండు టర్మ్‌ల్లో చెల్లించాలని తెలిపింది. అంతేకాదు అడ్మిషన్ ఫీజు రూ.లక్ష అని వెల్లడించింది. ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలని, జాయిన్ అవ్వకపోతే తిరిగి రీఫండ్ చేయడం కుదరదని స్పష్టం చేసింది.