News August 27, 2024
BSP జాతీయ అధ్యక్షురాలిగా తిరిగి ఎన్నికైన మాయావతి

BSP జాతీయ అధ్యక్షురాలిగా మాయావతి తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. BSP సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, జాతీయ స్థాయి ఆఫీస్ బేరర్లు, రాష్ట్ర పార్టీ నేతల ప్రత్యేక సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వెల్లడించింది. రాజకీయాల నుంచి మాయావతి రిటైర్ అవుతున్నట్టు వచ్చిన కొన్ని మీడియా కథనాలను ఆమె ఇటీవల కొట్టిపారేశారు. బహుజనులను బలహీనపరిచే కుట్రలను తిప్పికొట్టడానికి తుదిశ్వాస వరకు పనిచేస్తానని స్పష్టం చేశారు.
Similar News
News November 9, 2025
పాటీదార్‌కు గాయం.. 4 నెలలు ఆటకు దూరం!

భారత ప్లేయర్ రజత్ పాటీదార్ నాలుగు నెలల పాటు క్రికెట్‌కు దూరం కానున్నారని క్రీడావర్గాలు తెలిపాయి. సౌతాఫ్రికా-ఏతో జరిగిన తొలి అన్‌అఫీషియల్ టెస్టులో ఆయన గాయపడినట్లు వెల్లడించాయి. దీంతో ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టులోనూ ఆడట్లేదని పేర్కొన్నాయి. ఈ కారణంతో ఈ నెలాఖరు, డిసెంబర్‌లో జరిగే దేశవాళీ టోర్నీలకు ఆయన దూరం కానున్నారు. మరోవైపు పాటీదార్ త్వరగా కోలుకోవాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
News November 9, 2025
శబరిమలకు ప్రత్యేక రైళ్లు.. ఇవాళ్టి నుంచి బుకింగ్

అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు శబరిమలకు వెళ్లే భక్తుల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి SCR <<18224903>>మరిన్ని<<>> ప్రత్యేక రైళ్లు నడపనుంది. కాకినాడ టౌన్-కొట్టాయం, కొట్టాయం-కాకినాడ టౌన్, నాందేడ్-కొల్లామ్, కొల్లామ్-నాందేడ్, చర్లపల్లి-కొల్లామ్, కొల్లామ్-చర్లపల్లి మీదుగా 54 రైళ్లు నడపనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఇవాళ ఉ.8 గంటల తర్వాత నుంచి ఈ రైళ్లకు సంబంధించిన బుకింగ్ ప్రారంభం కానుందని IRCTC వెల్లడించింది.
News November 9, 2025
రెబకినా సంచలనం..

సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరిగిన WTA సింగిల్స్ ఫైనల్‌లో రెబకినా విజయం సాధించారు. ప్రపంచ నం.1 టెన్నిస్ ప్లేయర్ సబలెంకాతో జరిగిన మ్యాచులో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. దీంతో మ్యాచ్ వన్ సైడ్ కాగా 6-3, 7-6 పాయింట్లతో ఆమె టైటిల్ గెలిచారు. ఈ విజయంతో రికార్డు స్థాయిలో 5.2 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ రెబకినా ఖాతాలో చేరనుంది. ఈ ట్రోఫీ అందుకున్న తొలి ఆసియన్, కజికిస్థాన్ ప్లేయర్‌గానూ ఆమె నిలిచారు.


