News August 27, 2024
మార్కెట్‌లోకి ఓరల్ కలరా వ్యాక్సిన్

భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ ‘హిల్‌కాల్’ పేరుతో ఓరల్ కలరా వ్యాక్సిన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. గత ఏడాది మార్చి నుంచి ప్రపంచవ్యాప్తంగా 8,24,479 కలరా కేసులు నమోదయ్యాయి. 5,900 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 31 దేశాల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ కొరతకు చెక్ పెట్టేందుకు ఓరల్ వ్యాక్సిన్‌ను భారత్ బయోటెక్ విడుదల చేసింది.
Similar News
News April 18, 2026
B12 లోపంతో నరాలు దెబ్బతినే ప్రమాదం: వైద్యులు

రక్తహీనత లేకపోయినా 40% మందిలో విటమిన్ B12 లోపం వల్ల నరాల వ్యాధులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మెట్‌ఫార్మిన్ మందు వాడే 15–30% మధుమేహ బాధితుల్లో ఈ లోపం కనిపిస్తోందని చెబుతున్నారు. ‘B12 స్థాయి 200 pg/mL కంటే తగ్గితే నరాలు శాశ్వతంగా దెబ్బతినే ముప్పు ఉంది. కాబట్టి సకాలంలో B12, MMA, హోమోసిస్టీన్ పరీక్షలు చేయించుకోవాలి. ఆలస్యమైతే నష్టం పూడ్చలేం’ అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
News April 18, 2026
టెన్త్ ఫలితాలు ఎప్పుడంటే?

తెలంగాణ టెన్త్ పరీక్ష పేపర్ల వాల్యుయేషన్ ఈ నెల 23తో ముగించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. తరువాత మార్కుల నమోదు ప్రక్రియకు మరో పది రోజుల సమయం పట్టనుంది. దీంతో మే 4 లేదా 5 తేదీల్లో ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. టీజీలో మొత్తం 5.17 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాశారు.
అలాగే ఏపీలో ఈ నెలాఖరులో వెల్లడించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు.
News April 18, 2026
గ్రీన్ జెర్సీలో బరిలోకి దిగనున్న RCB

IPL-2026లో ఈరోజు RCBతో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. మధ్యాహ్నం 3:30 గంటల నుంచి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ మ్యాచులో ఆర్సీబీ గ్రీన్ కలర్ జెర్సీలో బరిలోకి దిగనుంది. ‘Go Green’ ఇనిషియేటివ్ కింద ఏటా ఒక హోమ్ మ్యాచ్‌లో ఆ జట్టు ప్లేయర్లు గ్రీన్ జెర్సీ ధరిస్తుంటారు. కాగా RCBలో ఈ ట్రెండ్ 2011 నుంచి కొనసాగుతోంది.


