News August 27, 2024

50 రోజుల్లో శిక్ష విధించాలి: TMC MP

image

దేశంలో అత్యాచార ఘటనలకు సంబంధించి 26% కేసుల్లోనే శిక్షలు పడుతున్నాయని TMC MP అభిషేక్ బెనర్జీ తెలిపారు. ఈ పరిస్థితుల్లో 50 రోజుల్లో విచారణ జరిపి శిక్ష అమలు చేసేలా యాంటీ రేప్ లా ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రతి 100 కేసుల్లో 26 మందే శిక్షలు అనుభవిస్తున్నారని, 74 మంది తప్పించుకుంటున్నారని వివరించారు. దేశంలో గత 15 రోజుల్లో మహిళలపై 24 రేప్, దాడుల ఘటనలు జరిగాయని పలు కథనాలను Xలో పోస్ట్ చేశారు.

Similar News

News January 2, 2026

IIIT పుణేలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

<>IIIT <<>>పుణే 17 అడిషినల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 6వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంటెక్(CS&Engg.), PhD (ఎలక్ట్రానిక్స్&కమ్యూనికేషన్ Engg., అప్లైడ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ/రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.iiitp.ac.in

News January 2, 2026

ముస్తాఫిజుర్ IPLలో ఆడతారా? BCCI రిప్లై ఇదే?

image

బంగ్లాదేశ్‌లో హిందువులపై వరుస <<18733577>>దాడుల<<>> నేపథ్యంలో ఆ దేశ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను IPLలో ఆడించొద్దన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. అయితే బంగ్లా ప్లేయర్లను బ్యాన్ చేయాలంటూ కేంద్రం నుంచి తమకు ఎలాంటి ఆదేశాల్లేవని BCCI ప్రతినిధి ఒకరు చెప్పినట్లు జాతీయ మీడియా పేర్కొంది. మరోవైపు ముస్తాఫిజుర్‌ను జట్టు నుంచి తొలగించాలని KKR, ఆ టీమ్ ఓనర్ షారుఖ్ ‌ఖాన్‌‌ను పలువురు హిందూ లీడర్లు డిమాండ్ చేస్తున్నారు.

News January 2, 2026

అధిక వడ్డీ ఆశ చూపి మోసం.. ప్రభుత్వం చర్యలు

image

AP: కర్నూలు జిల్లాలో అధిక వడ్డీ ఇస్తామంటూ స్కీమ్‌లతో మోసం చేసిన ‘శ్రేయ గ్రూప్’పై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఓనర్లు హేమంత్ కుమార్, సంగీతారాయ్ పేరిట ఉన్న ఆస్తులు సీజ్ చేసేందుకు CIDకి అనుమతి ఇచ్చింది. దీంతో జూపాడుబంగ్లా మండలం పారుమంచాలలో 51.55 ఎకరాల భూమిని CID సీజ్ చేయనుంది. భార్యాభర్తలైన హేమంత్, సంగీత 8,128 మంది డిపాజిటర్ల నుంచి రూ.206 కోట్లు వసూలు చేసి చేతులెత్తేశారు.