News August 27, 2024
బండి సంజయ్‌పై ధిక్కార చర్యలు తీసుకోండి: సుప్రీంకు KTR విజ్ఞప్తి

MLC కవిత బెయిల్ ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన <<13951590>>ట్వీట్‌కు<<>> కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ‘బాధ్యతాయుతమైన హోం శాఖ సహాయ మంత్రిగా ఉండి సుప్రీంకోర్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలపై స్పందించాలి. ఈయనపై ధిక్కార చర్యలను ప్రారంభించాలని కోరుతున్నా’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
Similar News
News January 31, 2026
ఎగ్జిమ్ బ్యాంక్‌లో 40 పోస్టులు.. అప్లై చేశారా?

<
News January 31, 2026
ఈ సెషన్‌లోనే పార్లమెంట్‌కు అమరావతి బిల్లు?

AP: రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే కేంద్ర హోంశాఖ నుంచి క్లియరెన్స్ లభించింది. ఇప్పుడు న్యాయశాఖ, పట్టణాభివృద్ధి వంటి 4 కేంద్ర శాఖల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. కేంద్ర క్యాబినెట్ ఆమోదించాక బిల్లును ఈ పార్లమెంట్ సెషన్‌లోనే ప్రవేశ పెట్టడానికి కూటమి MPలు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఆ బిల్లుపై YCP ఏ స్టాండ్ తీసుకుంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది.
News January 31, 2026
‘నో డ్యూ’తో మొండి బకాయిలు వసూలు!

TG: మున్సిపల్ ఎన్నికలతో ఇన్నాళ్ల మొండి బకాయిలు వసూలవుతున్నాయి. ఎలక్షన్స్‌లో పోటీ చేసే అభ్యర్థులకు ‘నో డ్యూ’ సర్టిఫికెట్ తప్పనిసరి కావడంతో వారంతా పెండింగ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారు. నిజామాబాద్ 19వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి శమంతనరేందర్ తమ వంశీ హోటల్‌కు సంబంధించి ఏకంగా రూ.7.50కోట్ల ఆస్తిపన్ను కట్టారు. అన్ని మున్సిపాలిటీల్లో కలిపి రూ.50 కోట్లకు పైగా పన్నులు వసూలైనట్లు అధికారులు తెలిపారు.


