News August 27, 2024
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో ‘పుష్ప 3’ కూడా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన చర్చలు పూర్తైనట్లు సమాచారం. పుష్ప2 విడుదలయ్యాక మూడో భాగంపై ప్రకటన రావొచ్చని అంచనా. ‘పుష్ప2’లో అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Similar News
News February 5, 2026
ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పోస్టులు

<
News February 5, 2026
పాలు పితికేటప్పుడు ఇవి గమనించాలి

రోజూ ఒకే సమయంలో పాలు పితకాలి. ఈ సమయంలో పశువు బెదరకుండా, చిరాకు పడకుండా చూడాలి. పాల ఉత్పత్తికి అవసరమయ్యే ఆక్సిటోసిన్ హార్మోను మెదడు నుంచి విడుదలై రక్తప్రసరణలో 8 నిమిషాలే ఉంటుంది. అందుకే పాలను 5-8 నిమిషాల లోపే తీయాలి. దీని వల్ల పాలలో అధిక వెన్నశాతం పొందొచ్చు. పాల తొలి ధారల్ని దూడలకు తాగించి, మలి ధారలను కేంద్రానికి పోయాలి. వీటిలో సుమారు 10% వెన్న ఉంటుంది. వీటిని దూడకు తాగించడం మంచిది కాదు.
News February 5, 2026
T20 WC: టాప్ రన్స్ వీరివే..

మెగాటోర్నీ T20 WCలో ఇప్పటివరకు అత్యధిక పరుగుల జాబితాలో రన్ మెషిన్ విరాట్ కోహ్లీ 1,292(35M) తొలి స్థానంలో ఉన్నారు. తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ(1,220-47M), జయవర్దనే(1,016-31M), బట్లర్(1,013-35M), వార్నర్(984-41M), గేల్(965-33M) ఉన్నారు. 9 సార్లు జరిగిన టోర్నీలో IND, ఇంగ్లండ్, వెస్టిండీస్ రెండేసి సార్లు.. పాక్, ఆస్ట్రేలియా, శ్రీలంక ఒక్కోసారి విజేతలుగా నిలిచాయి. >> FEB 7 నుంచి T20 WC మొదలుకానుంది.


