News August 27, 2024

రాజ్యసభ MPగా సింఘ్వీ ఎన్నిక ఏకగ్రీవం

image

తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మను సింఘ్వీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోటీలో ఎవరూ లేకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. కె.కేశవరావు MP పదవికి రాజీనామా చేసి BRS నుంచి కాంగ్రెస్‌లోకి మారడంతో ఆ స్థానం ఖాళీగా మారింది. ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీ సింఘ్వీని నామినేట్ చేసింది.

Similar News

News March 7, 2026

8 మంది MLAలకు క్లీన్ చిట్

image

TG: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణ ముగిసింది. 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్‌చిట్ ఇచ్చారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి కేసులో తీర్పును ఆయన రిజర్వ్ చేశారు.

News March 7, 2026

దేశంలోనే అతిపెద్ద లొంగుబాటు: రేవంత్

image

TG: దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద మావోయిస్టు <<19321592>>లొంగుబాటు<<>> అని CM రేవంత్ అన్నారు. మావోయిస్టు అగ్రనేత గణపతి సహా అజ్ఞాతంలో ఉన్న మిగతావాళ్లంతా జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. గణపతి రక్షణ, ఆరోగ్య భద్రత ప్రభుత్వానిదే అని హామీ ఇచ్చారు. లొంగిపోయిన మావోలకు ఆరోగ్య, ఆర్థిక భద్రతకు ప్రభుత్వం తరఫున హామీ ఇస్తున్నామన్నారు. మావోలు లేవనెత్తిన రాష్ట్ర పరిధిలోని అంశాలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.

News March 7, 2026

అవార్డుతో ‘తెలంగాణ కోడలికి’ వెల్కమ్ అంటూ ఫ్యాన్స్ ఖుషీ

image

TG ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో హీరోయిన్ రష్మిక ‘ఉత్తమ నటి’ అవార్డు గెలుచుకోవడంపై ఆమె ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. రష్మికను ‘తెలంగాణ కోడలు’గా అభివర్ణిస్తూ.. ఈ పురస్కారం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు ఘన స్వాగతం పలికిందని Xలో సందడి చేస్తున్నారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని అవార్డులు, సినిమాలు చేయాలని ఆకాంక్షిస్తూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. వారం క్రితమే విజయ్ దేవరకొండను రష్మిక మనువాడారు.