News August 27, 2024
ప్రజలకు ఆరోగ్యభద్రత కల్పించండి: జడ్పీ ఛైర్మన్

సీజనల్ వ్యాధులను అరికట్టి ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పించాలని జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కోరారు. విజయనగరం జిల్లాలో మలేరియా, డెంగ్యూ తదితర సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తక్షణమే అన్ని రకాల చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్థాయి సంఘ సమావేశాలు జడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం జరిగాయి.
Similar News
News October 1, 2025
దత్తి: పీ4ను అమలు చేసిన సీఎం.. యువకుడికి రూ.5లక్షల అందజేత

దత్తిలో నిర్వహించిన ప్రజా వేదికలో సీఎం చంద్రబాబు బంగారు కుటుంబాలు, మార్గదర్శిలతో ముఖా ముఖి మాట్లాడారు. ఈ నేపథ్యంలో ధనుంజయ నాయుడు అనే యువకుడు అనారోగ్య సమస్యతో బాధపడుతూ తన అన్నయ్య పిల్లలకు కూడా తానే దిక్కయ్యానని సీఎంకి వివరించాడు. దీనికి స్పందించిన సీఎం ఆయన ఆరోగ్య ఖర్చుల కోసం రూ.5 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. తక్షణమే స్పందించిన కలెక్టర్ ఆ చెక్కును యువకుడికి అందజేశారు.
News October 1, 2025
విజయనగరం ఉత్సవాల గోడపత్రికను ఆవిష్కరించిన మంత్రులు

ఈనెల 5, 6 తేదీల్లో జరగనున్న విజయనగరం ఉత్సవాల గోడ పత్రికను మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ బుధవారం ఆవిష్కరించారు. విజయనగర వైభవాన్ని చాటి చెప్పే విధంగా ఉత్సవాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ శ్రీనివాసులనాయుడు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
News October 1, 2025
VZM: పీ4 కార్యక్రమంపై చంద్రబాబు ఏమన్నారంటే..!

పీ4 ద్వారా లక్ష మంది మార్గదర్శకులు 10 లక్షల మంది పేదల్ని వృద్ధిలోకి తెస్తారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దత్తిలో ఏర్పాటు చేసిన ప్రజా వేదికలో ఆయన ప్రశాంగించారు. రాష్ట్రంలో ఆర్ధిక అసమానతలు తగ్గించి మెరుగైన జీవన ప్రమాణాలు అందించడానికే పీ4 కార్యక్రమం తీసుకువచ్చామన్నారు. ప్రజల బాగోగుల కోసం నిర్దిష్టమైన విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.