News August 27, 2024
BREAKING: జన్వాడ ఫామ్‌హౌస్‌కు ఇరిగేషన్ అధికారులు

TG: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని జన్వాడ ఫామ్‌హౌస్‌కు ఇరిగేషన్ అధికారులు చేరుకున్నారు. అక్కడ కొలతలు వేస్తూ పరిశీలిస్తున్నారు. కాగా, చెరువు FTLలో దాన్ని నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. ఆ ఫామ్‌హౌస్ తనది కాదని, లీజుకు తీసుకున్నానని కేటీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా అధికారులు అక్కడికి చేరుకోవడం చర్చనీయాంశంగా మారింది.
Similar News
News February 20, 2026
ఇవాళ కూడా నష్టాల్లోనే స్టాక్ మార్కెట్లు

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 158పాయింట్లు కోల్పోయి 82,339 వద్ద, నిఫ్టీ 35పాయింట్లు నష్టపోయి 25,419 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఎటర్నల్, HCL టెక్, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎయిర్‌టెల్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నిన్న కూడా సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోవడంతో రూ.7 లక్షల కోట్ల సంపద ఆవిరైంది.
News February 20, 2026
పిల్లలకు మేకప్ వేస్తున్నారా?

ప్రస్తుత రోజుల్లో పిల్లలకీ మేకప్ వేయడం సాధారణం అయిపోయింది. స్కూలు ప్రోగ్రాములున్నాయనో, వారు మారాం చేస్తున్నారనో మేకప్ వేస్తున్నారు. కానీ వీటివల్ల తలనొప్పి, త్వరగా నెలసరి రావడం, హార్మోనుల్లో అసమతుల్యత వంటి సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. తప్పనిసరి అయితే మైల్డ్వీ, సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రొడక్ట్స్ ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా లిప్ స్టిక్, మస్కారా వంటివి అస్సలు వాడకూడదని చెబుతున్నారు.
News February 20, 2026
16 శుక్రవారాల పాటు ఈ వ్రతాన్ని ఆచరిస్తే..

సంతోషీ మాత వ్రతాన్నే ‘16 శుక్రవారాల వ్రతం’ అంటారు. ఈ వ్రతం చేస్తే అద్భుత మార్పులుంటాయని నమ్మకం. ‘మానసిక ప్రశాంతత, సంతృప్తి లభిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగి, ధనప్రాప్తి కలుగుతుంది. వివాహం యోగం లేనివారికి మంచి ఫలితాలుంటాయి. దంపతుల మధ్య కలహాలు తొలగి అన్యోన్యత పెరుగుతుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. అనారోగ్యాలు దూరమవుతాయి. ఇల్లు సుఖసంతోషాలతో, ధనదాన్యాలతో విరాజిల్లుతుంది’ అని పండితులు చెబుతున్నారు.


