News August 27, 2024

రాత్రి 7 గంటలకు జైలు నుంచి కవిత విడుదల

image

సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత రిలీజ్ ఆర్డర్‌ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జారీ చేసింది. ట్రయల్ కోర్టులో ఆమె భర్త అనిల్, ఎంపీ రవిచంద్ర షూరిటీ పత్రాలు సమర్పించారు. ఇవాళ రాత్రి 7 గంటలకు జైలు నుంచి కవిత విడుదల కానున్నారు.

Similar News

News January 13, 2026

తప్పుడు కథనాలు, మార్ఫింగ్ ఫొటోల కేసులపై SIT ఏర్పాటు

image

TG: సోషల్ మీడియాలో సీఎం రేవంత్ రెడ్డి మార్ఫింగ్ ఫొటోలు, మహిళా ఐఏఎస్‌పై తప్పుడు కథనాల కేసులపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ రెండు కేసులను దర్యాప్తు చేసేందుకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) ఏర్పాటు చేసింది. ఐపీఎస్‌లు శ్వేత, యోగేశ్ గౌతమ్ సహా మొత్తం 8 మంది పోలీస్ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది.

News January 13, 2026

‘మీ సేవ’ ముసుగులో భూ రిజిస్ట్రేషన్ల నిధుల స్వాహా!

image

TG: భూ భారతిలో వెలుగు చూసిన రిజిస్ట్రేషన్ల నిధుల స్వాహాపై విచారణలో పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘మీసేవ’లో భూ రిజిస్ట్రేషన్లకు అవకాశం లేకున్నా కొందరు నిర్వాహకులు ప్రజలను మభ్యపెట్టి తతంగాన్ని నడిపించారు. భూ భారతి (గతంలో ధరణి) సైట్లో నేరుగా దరఖాస్తులు అప్లోడ్ చేసి అక్రమాలకు తెగబడ్డారు. ‘మీసేవ’ ప్రభుత్వానిదేనన్న ఉద్దేశంతో ప్రజలూ నమ్మారు. దీంతో నిర్వాహకులు సొమ్ము కాజేసినట్లు అనుమానిస్తున్నారు.

News January 13, 2026

రూ.200 కోట్లు దాటేసిన ‘రాజాసాబ్’

image

ప్రభాస్-డైరెక్టర్ మారుతి కాంబోలో వచ్చిన రాజాసాబ్ చిత్రం రూ.200 కోట్ల క్లబ్‌లో చేరింది. 4 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.201 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మూవీ టీమ్ పోస్టర్ రిలీజ్ చేసింది. మొదట సినిమాపై మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ప్రభాస్ ఓల్డ్ లుక్‌తో రూఫ్ టాప్ ఫైట్ యాడ్ చేసిన తర్వాత ఆ పరిస్థితి మారిపోయిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.