News August 27, 2024
యూపీఎస్సీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి: జేసీ

యూపీఎస్సీ నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ-II & కంబైన్డ్ డిఫెన్స్ అకాడమీ-2024 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ-II & కంబైన్డ్ డిఫెన్స్ అకాడమీ-2024 పరీక్షల నిర్వహణ కోసం కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు.
Similar News
News January 12, 2026
‘ఇంటర్ పరీక్షలను సజావుగా నిర్వహించండి’

ఈ నెల 21 నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షలను సజావుగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి మలోల ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి, పలు సూచనలు జారీ చేశారు. జనవరి 21న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, 23న ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
News January 12, 2026
అనంతపురం జిల్లా JC బదిలీ

అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ బదిలీ అయ్యారు. ఆయనను అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు జిల్లా నూతన జాయింట్ కలెక్టర్‌గా సి.విష్ణుచరణ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీగా ఉన్నారు. త్వరలోనే జిల్లా జేసీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
News January 12, 2026
అనంతపురం శిల్పారామంలో 14న సంక్రాంతి సంబరాలు

అనంతపురంలోని శిల్పారామంలో ఈ నెల 14 నుంచి 16 వరకు సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్నట్లు పరిపాలన అధికారి పి.శివ ప్రసాద్ రెడ్డి ఆదివారం తెలిపారు. సంస్కృతీ సంప్రదాయాల సమాహారం శిల్పారామం అన్నారు. సంక్రాంతి పండగను పురస్కరించుకొని విభిన్నమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 3 రోజులు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7:30 వరకు సంబరాలను నిర్వహిస్తామన్నారు.


