News August 27, 2024

కొండగట్టులో ఇక పార్కింగ్‌కు రుసుం వసూలు!

image

కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం పరిధిలో కొండపై వాహన పార్కింగ్‌కు రుసుము వసూలు చేయనున్నారు. దేవస్థానం కార్యాలయం ముందు గల ఖాళీ స్థలంలో ప్రస్తుతం వాహన పార్కింగ్ చేస్తున్నారు. దేవస్థానం అధికారులు పార్కింగ్‌కు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయకపోవడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, తాజాగా అధికారులు పార్కింగ్‌కు రుసుము వసూలు చేయాలని నిర్ణయించడం పట్ల భక్తుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Similar News

News January 11, 2026

KNR: కంటైనర్‌ బోల్తా.. రైతు స్పాట్‌డెడ్

image

శంకరపట్నం మండలం తాడికల్ గ్రామ శివారులో జరిగిన ఘోర ప్రమాదంలో స్థానిక రైతు రాణవేని హనుమంతు ప్రాణాలు కోల్పోయారు. వరంగల్ నుంచి పేపర్ లోడుతో వెళ్తున్న కంటైనర్, అండర్ ఫ్లైఓవర్ సమీపంలో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. రోడ్డు విస్తరణ పనుల వద్ద ఈ ప్రమాదం జరగగా, అండర్ ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తున్న హనుమంతుపై కంటైనర్ పడటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

News January 11, 2026

KNR: ఊరికెళ్తున్నారా.. ఇల్లు భద్రం: సీపీ

image

సంక్రాంతి, మేడారం జాతర నేపథ్యంలో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని KNR CP గౌష్‌ ఆలం సూచించారు. విలువైన ఆభరణాలు, నగదును వెంట తీసుకెళ్లడం, బ్యాంక్ లాకర్లలో ఉంచడం శ్రేయస్కరమన్నారు. ఇంటికి సెంట్రల్ లాకింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఊరెళ్లే సమాచారాన్ని పోలీసులకు తెలపాలని కోరారు. సోషల్ మీడియాలో పర్యటనల వివరాలు పంచుకోవద్దని, అనుమానితులు కనిపిస్తే డయల్ 100కు కాల్ చేయాలన్నారు.

News January 10, 2026

KNR: చైనా మాంజా వాడితే కఠిన చర్యలు: సీపీ

image

సంక్రాంతి వేళ నిషేధిత చైనా మాంజా విక్రయించినా, వాడినా కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం హెచ్చరించారు. నైలాన్ దారాల వల్ల పక్షులు, వాహనదారులకు ప్రాణాపాయం ఉందని, వీటిపై నిఘాకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు కేవలం కాటన్ దారాలనే వాడి, సురక్షితంగా పండుగ జరుపుకోవాలని ఆయన కోరారు.