News August 27, 2024
పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలి: కలెక్టర్

నంద్యాల జిల్లాలోని అన్ని ఫ్యాక్టరీలు, పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు పాటించి ఉద్యోగులు, కార్మికుల రక్షణకు ప్రాధాన్యతనివ్వాలని కలెక్టర్ రాజకుమారి సంబంధిత నిర్వాహకులను సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఇటీవల జరిగిన ప్రమాద ఘటన నేపథ్యంలో జిల్లాలోని ఫ్యాక్టరీలు, పరిశ్రమల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. 28 వేల మంది వివిధ చోట్ల పని చేస్తున్నారన్నారు.
Similar News
News February 21, 2026
జగన్ క్షమాపణ చెప్పాలి: మంత్రి టీజీ భరత్

తిరుమల అంశంపై మాజీ సీఎం జగన్ భక్తులకు క్షమాపణ చెప్పాలని మంత్రి TG భరత్ డిమాండ్ చేశారు. శనివారం కర్నూలులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లుతో కలిసి పూజలు, మహా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. నెయ్యి కల్తీ వాస్తవమని, వైసీపీ నేతలు కౌన్సిల్‌లో చెప్పులు వేసుకుని స్వామి ఫొటోలు ప్రదర్శించడం బాధాకరమన్నారు. నిజాలు కప్పిపుచ్చేందుకే జగన్ అడ్డంగా వాదిస్తున్నారని విమర్శించారు.
News February 21, 2026
ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రత: కర్నూలు కలెక్టర్

కర్నూలు కలెక్టరేట్ ఆవరణలో ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ప్రతిజ్ఞతో ప్రారంభించారు. ‘జీరో లిటర్ గవర్నెన్స్’ థీమ్‌తో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రత సాధ్యమని చెప్పారు. ప్రతి ఒక్కరూ ‘జీరో-వేస్ట్’ జీవనశైలి అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. అధికారులు, సిబ్బంది స్వచ్ఛత దిశగా అడుగులు వేయాలని ఆమె కోరారు.
News February 20, 2026
పరిహారం త్వరితగతిన మంజూరు చేయాలి: జేసీ

కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుకు సంబంధించి జిల్లా విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సమావేశం జేసీ నూరుల్ ఖమర్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పకడ్బందీగా అమలు చేయాలన్నారు. బాధిత కుటుంబాలకు ఉపాధి, ఇంటి స్థలం, అర్హత కలిగిన ఇతర ప్రయోజనాలను త్వరితగతిన మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.


