News August 27, 2024

ICC ఛైర్మన్‌గా జైషా!

image

ఐసీసీ ఛైర్మన్‌గా బీసీసీఐ కార్యదర్శి జైషా పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ఐసీసీ నుంచి అధికారిక ప్రకటన రానుంది. కాగా నవంబర్ 30తో ప్రస్తుత ఛైర్మన్ గ్రెగ్ బార్‌క్లే పదవీకాలం ముగియనుంది. మరోసారి ఈ పదవి చేపట్టేందుకు ఆయన విముఖత చూపారు. దీంతో జై షా ఛైర్మన్ రేసులో ముందున్నారు. ఒకవేళ ఎన్నికైతే ఆయన రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.

Similar News

News July 4, 2025

కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు: దాసోజు శ్రవణ్

image

TG: మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని BRS ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ Way2Newsకు తెలిపారు. KCRకు తీవ్ర అనారోగ్యం ఉన్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. సాధారణ నీరసానికే చికిత్స తీసుకుంటున్నారని చెప్పారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ‘పోలవరం-బనకచర్ల’ ప్రాజెక్టుపై పోరాటానికి సిద్ధమవుతున్నారని దాసోజు పేర్కొన్నారు. కాగా సోడియం లెవెల్స్ పడిపోవడంతో కేసీఆర్ చికిత్స తీసుకుంటున్నారు.

News July 4, 2025

ALERT.. ఈ జిల్లాల్లో వర్షాలు: వాతావరణ కేంద్రం

image

తెలంగాణలో రానున్న 5 రోజులు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఉదయం వరకు ADB, ASF, మంచిర్యాల, నిర్మల్, NZB, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, MHBD, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, MBNR జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. అన్ని జిల్లాల్లో గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

News July 4, 2025

పార్టీ పదవులను క్యాజువల్‌గా తీసుకోవద్దు: రేవంత్

image

TG: రాష్ట్రంలో వచ్చే పదేళ్లు కాంగ్రెస్‌దే అధికారం అని CM రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. ‘కేంద్రం మెడలు వంచి జనగణనలో కులగణన చేసేలా చేశాం. ఎవరూ పార్టీ పదవులను క్యాజువల్‌గా తీసుకోవద్దు. వాటితోనే గుర్తింపు, గౌరవం లభిస్తాయి. అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పెరగబోతున్నాయి. కొత్త నాయకత్వానికి 2029 ఎన్నికలు వేదిక కావాలి. కష్టపడి మళ్లీ INCని అధికారంలోకి తేవాలి’ అని TPCC కార్యవర్గ సమావేశంలో పేర్కొన్నారు.