News August 27, 2024
రైలు ప్రమాదమంటూ ఫేక్ పోస్ట్.. కాంగ్రెస్‌పై రైల్వే శాఖ ఫైర్

ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో రైలు ప్రమాదం జరిగిందని, లోకో పైలట్‌తో పాటు మరికొందరికి గాయాలైనట్లు కాంగ్రెస్ ట్వీట్ చేసింది. దీనిపై రైల్వే శాఖ ఘాటుగా స్పందించింది. దేశాన్ని తప్పుదోవ పట్టించొద్దని, పోస్టులోని ఇంజిన్, డ్రైవర్ భారతీయ రైల్వేకు చెందినవారు కాదని స్పష్టం చేసింది. రైల్వేపై తప్పుడు ఆరోపణలు చేయొద్దని పేర్కొంది. పోస్ట్ పెట్టిన వారిపై కేసు నమోదు చేయాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News March 5, 2026
ఇరాన్‌తో యుద్ధం.. 10కి 15 మార్కులేసిన ట్రంప్

ఇరాన్‌పై చేస్తున్న యుద్ధంలో అమెరికా మిలిటరీ అసామాన్యంగా పోరాడుతోందని ట్రంప్ కొనియాడారు. ఈ సందర్భంగా తమ దేశ సైన్యానికి 10కి 15 మార్కులేశారు. తమతో పాటు ఇరాన్‌పై యుద్ధం చేస్తున్న మిత్రదేశాలు ఇప్పటికే పైచేయి సాధించాయని చెప్పారు. ప్రస్తుతం తాము కమాండింగ్ పొజిషన్‌లో ఉన్నామన్నారు. ఈ యుద్ధంలో వెయ్యి మందికి పైగా ఇరానియన్స్ చనిపోయినట్లు US హ్యూమన్ రైట్స్ గ్రూప్ చెబుతోంది.
News March 5, 2026
ముంబై పోర్ట్ అథారిటీలో 26 పోస్టులు

<
News March 5, 2026
4 రోజుల్లో రూ.9,560 తగ్గిన 10గ్రా.ల గోల్డ్ రేటు

బంగారం, వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ వీటి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.980 తగ్గి రూ.1,63,530కు చేరింది. నాలుగు రోజుల్లోనే రూ.9,560 తగ్గడం విశేషం. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.900 పతనమై రూ.1,49,900 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు రూ.2,95,000గా ఉంది.


