News August 27, 2024

DSPని పరామర్శించిన ఎస్పీ కృష్ణ కాంత్

image

ప్రమాదంలో గాయపడిన నెల్లూరు రూరల్ DSP శ్రీనివాసరావు ఇంటికి జిల్లా యస్.పి. కృష్ణకాంత్ వెళ్లి పరామర్శించారు.  DSP ధైర్య సాహసాలను ఎస్పీ మెచ్చుకొని, స్యయంగా ప్రశంసాపత్రం అందించి అభినందించారు. జిల్లా పోలీసు యంత్రాంగం వారి వెంటే ఉందని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. త్వరగా పూర్తిగా కోలుకొని, కలిసి విధులు నిర్వహించాలని రూరల్ DSP కి మనోధైర్యం చెప్పిన అన్ని విధాల తోడ్పాటు అందిస్తామన్నారు.

Similar News

News January 11, 2026

నెల్లూరు: మీకు విద్యుత్ సమస్యలా.?

image

నెల్లూరు జిల్లా విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం “డయల్ యువర్ ఎస్ఈ” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సూపరింటెండింగ్ ఇంజినీర్ కె.రాఘవేంద్ర తెలిపారు. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు 0861–2320427 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలను నేరుగా తెలియజేయవచ్చు. నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.

News January 11, 2026

నెల్లూరు: 20 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం

image

నెల్లూరు జిల్లాలో వాయుగుండం ప్రభావంతో చలి తీవ్రత పెరిగింది. ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉండగా, కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. సముద్రం సుమారు 20 మీటర్ల వరకు ముందుకు రావడంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అలల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మత్స్యకారులు 5 రోజుల పాటు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. తీర గ్రామాల్లో అధికారులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

News January 11, 2026

రాష్ట్రంలో నెల్లూరుకు మొదటి స్థానం

image

జిల్లా మ్యూజియంకు రాష్ట్రంలో మొదటి స్థానం దక్కిన్నట్లు మ్యూజియం ఇన్‌ఛార్జ్ శివారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో 5 జిల్లా సైన్స్ మ్యూజియం కేంద్రాలు ఉండగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్ నుంచి డిసెంబర్ వరకు సైన్స్ మ్యూజియం చూసేందుకు వచ్చిన సందర్శకుల వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు – 10 వేలు, కడప – 854, ఏలూరు – 3,540, చిత్తూరు – 4,000, అనంతపురం – 5,636 మంది సందర్శించారు.