News August 27, 2024
ప్రజారోగ్యానికి టీడీపీ ప్రభుత్వం ఉరితాడు వేస్తోంది: జగన్

కృష్ణా: రాష్ట్రంలో ప్రజారోగ్యానికి టీడీపీ ప్రభుత్వం ఉరితాడు వేస్తోందని మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందడంలేదని, రాష్ట్రంలో మెడికల్ కళాశాలల పురోగతి సైతం కుంటుపడిందని జగన్ వ్యాఖ్యానించారు. వైద్య సిబ్బంది నియామకం, ఆరోగ్యశ్రీ అమలులో వైఫల్యం టీడీపీ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని జగన్ ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.
Similar News
News March 14, 2026
9వ తరగతి నుంచే ‘పదో తరగతి’కి సన్నద్ధం: కలెక్టర్

వచ్చే విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు కలెక్టర్ బాలాజీ వినూత్న కార్యాచరణ ప్రకటించారు. ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇప్పుడే 10వ తరగతి సిలబస్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. 2027 SSC పరీక్షల కోసం వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో విద్యార్థులను తీర్చిదిద్దాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
News March 14, 2026
కృష్ణా: విధుల పట్ల నిర్లక్ష్యం.. సస్పెండ్, షోకాజ్ నోటీసులు

విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై కృష్ణా జిల్లా కలెక్టర్ కఠిన చర్యలు చేపట్టారు. పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డోకిపర్రు గ్రామ పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్–2) రజియా సుల్తానాను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా జనాభా లెక్కల శిక్షణ కార్యక్రమానికి హాజరు కాని వడ్లమన్నాడు సచివాలయ డేటా అసిస్టెంట్ కె. సురేంద్రకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
News March 13, 2026
గన్నవరం: మంచుతో విమాన రాకపోకలకు అంతరాయం

గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో శుక్రవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. విజిబిలిటీ తీవ్రంగా తగ్గిపోవడంతో విమానాల రాకపోకలు అంతరాయం కలిగాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ నుంచి రావాల్సిన విమానాలు కొంతసేపు గాల్లోనే చక్కర్లు కొట్టాయి. పరిస్థితి మెరుగుపడిన తర్వాతే విమానాల ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వడం జరిగిందని అధికార వర్గాలు వెల్లడించారు.


