News August 27, 2024

గతాన్ని మర్చిపోయి మాట్లాడితే నేను వస్తా: బొలిశెట్టి

image

తాడేపల్లిగూడెం MLA బొలిశెట్టి శ్రీనివాస్ హీరో అల్లు అర్జున్‌పై వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ‘X’ వేదికగా మరోసారి స్పందించారు. “నాకు ఇష్టమైతే నేను వస్తా’ ఓ మెగా అభిమానిగా చిరంజీవి, నాగబాబు, పవన్‌ను ఎవరైనా గౌరవం లేకుండా మాట్లాడితే నేను వస్తా! గతాన్ని మర్చిపోయి మాట్లాడితే కచ్చితంగా వస్తా! నేను చెప్పదలుచుకున్నదేంటంటే నా వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతం. ఒక అభిమానిగానే స్పందించా’నని అన్నారు.

Similar News

News March 11, 2026

ప.గో: ఇక్కడే ఆడుకున్నాడు.. దేశానికి కీర్తి తెచ్చాడు

image

టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టు సభ్యుడు తిలక్ వర్మ విజయం పట్ల అతడి అమ్మమ్మ ఊరు ఉండి మండలం వాండ్రంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మనవడి అద్భుత ప్రతిభను చూసి తాతయ్య సుబ్బరాజు, అమ్మమ్మ సుందరమ్మ అమితానందం వ్యక్తం చేశారు. చిన్ననాడు తమవద్దే ఆడుకున్న బిడ్డ నేడు దేశానికి కీర్తిప్రతిష్టలు తీసుకురావడం ఎంతో గర్వకారణమన్నారు. మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వారు మనసారా ఆకాంక్షించారు.

News March 11, 2026

ప.గో: గ్యాస్ బుకింగ్‌లో కొత్త నిబంధనలు

image

గ్యాస్ బుకింగ్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు జిల్లాలో వినియోగదారులకు ఇబ్బందికరంగా మారింది. ఓవైపు సిలిండర్ ధరలు పెరగగా మరోవైపు గతంలో సింగిల్ బండ 15 రోజులు బుక్ చేసుకునే సౌకర్యం ఉండేది. కొత్త నిబంధనల ప్రకారం సింగిల్ బండ ఓనర్ 25 రోజుల తర్వాత, డబుల్ బండ వారు 30రోజుల తర్వాత మాత్రమే గ్యాస్ బుక్ చేసుకోవాలని నిబంధనలు తీసుకొచ్చింది. ఈ నిబంధన భారంగా మారిందని వినియోగదారులు వాపోతున్నారు.

News March 11, 2026

ప.గో: అసభ్య పదజాలం.. ఫొటోలతో వివాహితకు బెదిరింపులు

image

ఫోన్ ద్వారా వివాహితను అసభ్య పదజాలంతో దూషిస్తూ, సోషల్ మీడియాలో ఫొటోలు పెడతానంటూ బెదిరిస్తున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కథనం.. నరసాపురం టౌన్‌లోని ఓ వివాహితను ఏడాదిగా గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ ద్వారా వేదిస్తున్నారు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు నరసాపురం టౌన్ ఎస్ఐ ఎస్.ముత్యాలరావు కేసు నమోదు చేశారు. నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.