News August 27, 2024

ఫ్రీ హోల్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేయకండి: కలెక్టర్

image

జిల్లాలోని ప్రీ హోల్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేయవద్దని సబ్ రిజిస్ట్రార్లను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. నిషేధిత ఆస్తుల జాబితాకు సంబంధించి సెక్షన్ 22ఏ పరిధిలోకి వచ్చే అసైన్డ్, ప్రభుత్వ, దేవాలయ భూములకు సంబంధించి అన్యాక్రాంతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జేసీ విష్ణు చరణ్, అధికారులు పాల్గొన్నారు.

Similar News

News March 16, 2026

కర్నూలు జిల్లాలో గ్యాస్ కొరత లేదు: JC

image

కర్నూలు జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో సుమారు 11వేల సిలిండర్లు నిల్వలో ఉండగా, అదనంగా 7వేల సిలిండర్లు చేరుకున్నాయన్నారు. ప్రతిరోజు సగటున 10వేల సిలిండర్లు వినియోగదారులకు పంపిణీ జరుగుతోందన్నారు. గ్యాస్ కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ఏజెన్సీలు ఇబ్బందులు కలిగిస్తే 1967 టోల్ ఫ్రీ నంబర్‌‌ను సంప్రదించాలన్నారు.

News March 16, 2026

కర్నూలు: పోలీస్ పరిష్కార వేదికకు 102 వినతులు

image

వినతులు అందించిన వారికి విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ పీజీఎస్ఆర్‌లో మొత్తం 102 ఫిర్యాదులు స్వీకరించారు. ఉద్యోగ మోసం, భూ వివాదాలు, ప్లాట్ రిజిస్ట్రేషన్ సమస్యలు, ఫైనాన్స్ తదితర అంశాలపై ప్రజలు వినతులు అందించారు. ప్రతి ఫిర్యాదును చట్ట ప్రకారం పరిశీలించి బాధితులకు న్యాయం చేస్తామన్నారు.

News March 16, 2026

పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సిరి

image

కర్నూలు ఏ క్యాంప్‌లోని ఇందిరాగాంధీ స్మారక నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి సోమవారం పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన వసతులపై విద్యాశాఖ అధికారులతో చర్చించారు. ఎండల తీవ్రత దృష్ట్యా పరీక్షా కేంద్రాల వద్ద మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచామని ఏపీసీ లోకరాజు తెలిపారు. నిబంధనల ప్రకారం పరీక్షలు సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నారు.