News August 27, 2024

కడప జిల్లాలో సులభతరంగా ఇసుక సరఫరా.!

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇసుక పంపిణీ విధానం జిల్లాలో చట్టబద్ధంగా, సజావుగా, సులభతరంగా సాగేలా పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని, కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జేసీ అదితి సింగ్‌తో కలిసి మంగళవారం సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఉచిత ఇసుక విధానంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పారదర్శకంగా పంపిణీ జరగాలన్నారు.

Similar News

News April 19, 2026

కడప: మీ పిల్లలకు వినికిడి సమస్య ఉందా.?

image

వినికిడి సమస్య ఉన్న ఎందరో చిన్నారుల జీవితాలు చిన్నాభిన్నం కాకుండా TTD ‘శ్రవణం’ పేరుతో కాపాడుతోంది. సాంకేతికతతో <<19688732>>చెవుడు<<>>ను పోగొట్టవచ్చు. ఇది తెలియని తల్లిదండ్రులు తమ చిన్నారుల విషయంలో నష్టపోతున్నారు. వీరి కోసమే TTD 2006 నుంచి తిరుపతిలోని ఓల్డ్ మెటర్నిటీ ఆసుపత్రి భవనంలో శ్రవణం ప్రాజెక్ట్ ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇప్పటి వరకు 14 వందల మంది చిన్నారులకు సమ్యను దూరం చేశారు.

# SHARE IT.

News April 19, 2026

తిరుమల శ్రీవారికి ‘రూ.కోటి’ విరాళం ఇస్తే.!

image

☞దాతతోపాటు నలుగురు ఏడాదిలో 3 రోజులు సుప్రభాత సేవ, 3 రోజులు బ్రేక్ దర్శనం, 4 రోజులు సుపథం ప్రవేశ దర్శనం పొందవచ్చు ☞అంతేకాకుండా 10 పెద్ద లడ్డూలు, 20 చిన్న లడ్డూలు, దుప్పట-1, రవికె-1, మహాప్రసాదం ప్యాకెట్లు-10, ఒకసారి వేద ఆశీర్వచనం పొందవచ్చు ☞వీటితోపాటు రూ.3 వేల విలువ చేసే వసతి గదుల సదుపాయం 3 రోజులు కల్పిస్తారు ☞జీవిత కాలంలో ఒకసారి దాత 5గ్రా. శ్రీవారి బంగారు డాలర్, 50 గ్రా.సిల్వర్ డాలర్ పొందవచ్చు.

News April 19, 2026

కడప కలెక్టరేట్ వద్ద మాస్టార్ల ధర్నా.!

image

కడప కలెక్టరేట్ వద్ద శనివారం APTF ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా APTF రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్‌రెడ్డి మాట్లాడుతూ.. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులను ప్రభుత్వం రోడ్డెక్కేలా చేయడం తగదన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం సాచివేత ధోరణి అవలంబిస్తోందని విమర్శించారు. ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.