News August 27, 2024

రీరిలీజ్‌లకు కారణాలివేనా?

image

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల పుట్టినరోజు కానుకగా అలనాటి హిట్ మూవీలను మళ్లీ రిలీజ్ చేస్తున్నారు. దీనికి బర్త్ డేలు ఓ కారణమైతే ఆ టైమ్‌కు థియేటర్లలో నడుస్తున్న కొత్త సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోవడం మరో కారణంగా తెలుస్తోంది. అటు అప్పట్లో చూడలేకపోయిన ఫేవరెట్ హీరో మూవీలను ప్రస్తుతం థియేటర్లో చూసే ఛాన్స్ రావడంతో ఫ్యాన్స్‌ టెంప్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది.

Similar News

News February 13, 2026

GNT: Msc మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాల విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో గత నవంబర్ నెలలో జరిగిన Msc మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు శుక్రవారం తెలిపారు. రీవాల్యుయేషన్‌కు దరఖాస్తులు ఈ నెల 23వ తేదీలోగా అందించాలని సూచించారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in సంప్రదించాలన్నారు.

News February 13, 2026

బర్డ్ ఫ్లూ భయం.. పడిపోయిన చికెన్ ధరలు

image

AP: ఉమ్మడి చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో <<19090331>>బర్డ్‌ ఫ్లూ బయటపడటంతో<<>> చికెన్ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. 10 రోజుల కిందటి వరకు కేజీ చికెన్ రూ.300పైనే ఉండగా ప్రస్తుతం రూ.160-180కి తగ్గింది. కాగా బర్డ్‌ఫ్లూ ఉన్నప్పటికీ ఎలాంటి భయం లేదని అధికారులు చెబుతున్నారు. చికెన్, కోడి గుడ్లను 100 డిగ్రీలపైన వేడితో ఉడికించి తింటే ప్రమాదం లేదంటున్నారు. మీ ఏరియాలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News February 13, 2026

దేశవ్యాప్తంగా సిట్టింగ్ జడ్జిలపై 8,630 ఫిర్యాదులు

image

గత దశాబ్ద కాలంలో సిట్టింగ్ జడ్జిలపై భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయానికి 8,630 ఫిర్యాదులు వచ్చాయని కేంద్రం ఇవాళ లోక్‌సభలో వెల్లడించింది. ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. 2024లో మాజీ CJI చంద్రచూడ్, మాజీ CJI సంజీవ్ ఖన్నా పదవీ కాలంలో ఎక్కువ ఫిర్యాదులు నమోదయ్యాయని తెలిపింది. పదేళ్ల గణాంకాలు చూస్తే ఎక్కువగా 2022లో 1,012, 2023లో 977, 2024లో 1,170, 2025లో 1,102 ఫిర్యాదులు నమోదయ్యాయంది.