News August 27, 2024
ఉమ్మడి వరంగల్ జిల్లాలో టాప్ న్యూస్

> WGL: WAY2NEWS ఎఫెక్ట్.. ఫ్లెక్సీ మార్పు
> MLG: రామప్ప దేవాలయం, లక్నవరం సరస్సును సందర్శించిన గవర్నర్
> BHPL: ఈనెల 29న జాబ్ మేళా
> WGL: క్వింటా పత్తి ధర రూ.7,600
> BHPL: మేడిగడ్డ బ్యారేజీకి పెరిగిన వరద
> MLG: వాగు దాటాలంటే.. ట్రాక్టర్ టైరు ఆధారం!
> WGL: అండర్ బ్రిడ్జి వద్ద అగ్ని ప్రమాదం
> HNK: విష జ్వరాల నియంత్రణకు చర్యలు
Similar News
News March 3, 2026
ప్రభుత్వాసుపత్రిలో సమయపాలన పాటించాలి: కలెక్టర్

వరంగల్ జిల్లాలోనీ ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి, డాక్టర్లు సమయపాలన పాటించి, ప్రజలకు వైద్య సేవలు అందించాలని కలెక్టర్ డా.సత్య శారద హెచ్చరించారు. సోమవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, సూపరిండెంటెంట్లతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
News February 28, 2026
వరంగల్: ఇంటర్ పరీక్షలకు 212 మంది గైర్హాజరు

జిల్లాలో జరుగుతున్న ఇంటర్ పరీక్షల్లో విద్యార్ధుల గైర్హాజరు కలవర పెడుతోంది. ఒకే రోజులో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లిష్ పరీక్షకు 5,179 మందిలో 143 మంది, ఒకేషనల్ కోర్సుకు 823 మందిలో 69 మంది గైర్హాజరైనట్లు డీఈవో రంగయ్య నాయుడు తెలిపారు. మొత్తం 212 మంది హాజరు కాలేదన్నారు. పరీక్షల నిర్వహణలో పరీక్ష నిర్వాహకులుగా మాధవరావు, బండి విజయనిర్మల పూర్తి స్థాయిలో పర్యవేక్షించినట్లు వెల్లడించారు.
News February 28, 2026
మత్తు పదార్థాల విక్రయదారులను కనిపెట్టాలి: కలెక్టర్

పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో మత్తు పదార్థాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్య శారద పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా నార్కోటిక్ కమిటీ సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి ఆమె సమీక్షించారు. విద్యాసంస్థల ప్రాంగణాల్లో మాదక ద్రవ్యాల రవాణా జరగకుండా నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు.


