News August 28, 2024

TODAY HEADLINES

image

* TGలో రేషన్, హెల్త్ కార్డుల కోసం SEP 17 నుంచి ప్రజాపాలన కార్యక్రమం
* జైలు నుంచి MLC కవిత విడుదల
* రాజ్యసభ MPగా సింఘ్వీ ఎన్నిక ఏకగ్రీవం
* బలవంతపు మత మార్పిడులు జరగకుండా చూడాలి: CM CBN
* వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి
* ICC ఛైర్మన్‌గా జై షా

Similar News

News November 8, 2025

దేశంలోనే మొదటి పురోహితురాలు

image

సాధారణంగా పెళ్లిళ్లు, అన్నప్రాశనలు, పూజలు వంటివన్నీ పురుషులే చేస్తుంటారు. కానీ కలకత్తాకి చెందిన నందిని భౌమిక్ పదేళ్లుగా పురోహితురాలిగా వ్యవహరిస్తోంది. నందిని రెండో కూతురి వివాహానికి పురోహితుడు ఎవరూ దొరక్కపోవడంతో ఆమే పురోహితురాలిగా మారారు. ఈ నిర్ణయాన్ని పురుషుల కంటే మహిళలే ఎక్కువగా వ్యతిరేకించారంటున్నారు నందిని. ఎప్పటికైనా ప్రజల ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావాలనేదే తన ఉద్దేశం అని చెబుతున్నారామె.

News November 8, 2025

రాజ్‌తో ఫొటో వైరల్.. సమంత రెండో పెళ్లిపై చర్చ!

image

సమంత నిన్న రాజ్ నిడిమోరుతో క్లోజ్‌గా ఉన్న <<18228781>>ఫొటోను<<>> షేర్ చేయడంతో పెళ్లి ఎప్పుడనే చర్చ మొదలైంది. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ‘ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్ సిరీస్ నుంచి సమంత, రాజ్ స్నేహం మొదలైంది. అప్పటినుంచి వీరిద్దరూ డేట్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు రాజ్ తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నారని బాలీవుడ్ మీడియా ఎప్పటినుంచో కోడై కూస్తోంది.

News November 8, 2025

రబీ వరి సాగు విధానం.. విత్తన మోతాదు

image

☛ నారు నాటే పద్ధతి – 20 కిలోల విత్తనం అవసరం.
☛ ఎద పద్ధతి – 12-15 కిలోలు(మండి కట్టిన విత్తనం), 25-30 కిలోలు( పొడి విత్తనం)
☛ శ్రీవరి సాగు పద్ధతి – 2 కిలోల విత్తనం అవసరం.
☛ యాంత్రిక పద్ధతిలో వరి సాగుకు 10-12 కిలోల విత్తనం
☛ బెంగాల్ పద్ధతిలో వరి సాగు 8-10 కిలోల విత్తనం కావాలి.
☛ నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు విత్తుకోవచ్చు. కిలో పొడి విత్తనాలకు 3గ్రాముల కార్బండిజమ్‌తో శుద్ధి చేయాలి.