News August 28, 2024

రెవెన్యూ సదస్సులకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి: కలెక్టర్

image

త్వరలో జరగనున్న గ్రామం రెవెన్యూ సర్వీసులకు సంబంధిత అధికారులు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. భూ సమస్యలపై సదస్సులు నిర్వహిస్తున్నందున సంబంధిత రెవెన్యూ అధికారులు కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలన్నారు.

Similar News

News March 24, 2026

ఆదర్శ నాయుడి హత్య కేసు.. ఐదుగురి అరెస్ట్

image

రెండు రోజుల కిందట అనంతపురం RTC బస్టాండ్ వద్ద జరిగిన హత్య కేసులో ఐదుగురు నిందితులను మంగళవారం అరెస్టు చేసినట్లు 3-టౌన్ CI రాజేంద్రనాథ్ యాదవ్ తెలిపారు. బన్నీ, కరుణాకర్‌రెడ్డి, రాజేశ్, అస్మిత్ చౌదరి, బండి ఉజ్జనప్పను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. ఆకుల వంశీ కృష్ణపై పాత కక్షతో దాడి చేయాలని యోచించిన నిందితులు, అతనితోపాటు ఉన్న ఆదర్శ నాయుడిపై తీవ్రంగా దాడి చేయగా అతను మృతి చెందారు.

News March 24, 2026

రోడ్డు భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి: జిల్లా కలెక్టర్

image

రోడ్డు భద్రతా చర్యలు చేపట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా రోడ్డు భద్రతా సమావేశాన్ని ఎస్పీ జగదీశ్‌తో కలిసి కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతకోసం తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.

News March 24, 2026

ఆర్డీటీ పోరాటం సఫలం: మాజీ ఎంపీ తలారి రంగయ్య

image

ఆర్డీటీ సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధరణ కోసం చేసిన పోరాటం ఫలించిందని మాజీ ఎంపీ తలారి రంగయ్య తెలిపారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని గుంజి తాండ నుంచి చేపట్టిన పాదయాత్ర, పోస్టు కార్డుల ఉద్యమం ద్వారా సంస్థకు న్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు. సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగేలా శుభవార్త రావడం సంతోషంగా ఉందన్నారు. ఆర్డీటీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.