News August 28, 2024

ట్రక్కు లోయలో పడి ముగ్గురు సైనికులు మృతి

image

అరుణాచల్ ప్రదేశ్‌లోని సుబాన్సిరి జిల్లాలో ట్రక్కు లోయలో పడిన ఘటనలో ముగ్గురు సైనికులు మరణించారు. మరో నలుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మరణించిన వారిని హవల్దార్ నఖత్ సింగ్, నాయక్ ముకేశ్ కుమార్, గ్రెనేడియర్ అశిశ్‌గా గుర్తించారు. మృతుల కుటుంబాలకు భారత సైన్యం అండగా ఉంటుందని ఈస్టర్న్ కమాండ్ Xలో పోస్ట్ చేసింది.

Similar News

News March 14, 2026

హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్ రైల్!

image

TG: హైదరాబాద్ చుట్టూ ఏర్పాటయ్యే రీజినల్ రింగురోడ్డు వెంబడే రీజినల్ రింగ్ రైల్ (RRR) ఏర్పాటుకానుంది. దీని DPR కోసం సర్వేకి అనుమతులు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ లోక్‌సభలో MP కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నకు సమాధానమిచ్చారు. నీతి ఆయోగ్, ఆర్థికశాఖ అనుమతి తరువాత దీనికి తుది అనుమతి లభించనుంది. దీనివల్ల HYD చుట్టూ ఉన్న ప్రాంతాలకు రవాణా సులభం అవడంతో పాటు ఆర్థికాభివృద్ధికి మార్గం ఏర్పడుతుంది.

News March 14, 2026

OTP పద్ధతిలోనే సిలిండర్: పయ్యావుల

image

AP: రాష్ట్రంలో గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. సిలిండర్ బుకింగ్ ఆన్‌లైన్‌లో ఉండాలని ఏజెన్సీలకు స్పష్టం చేశామన్నారు. బ్లాక్ మార్కెట్‌కు తరలిపోకుండా OTP పద్ధతిలోనే సిలిండర్ ఇస్తారని పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. గ్యాస్ ధరలు పెరగకుండా చూస్తున్నామన్నారు. అధిక ధరలు వసూలు చేసే హోటళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు.

News March 14, 2026

పెట్రోల్, డీజిల్‌ను నిల్వ చేస్తున్నారా?

image

యుద్ధం కారణంగా ఇంధనం కొరత రావొచ్చనే భయంతో చాలా మంది పెట్రోల్, డీజిల్‌ను విడిగా తీసుకెళ్లి నిల్వ చేసుకుంటున్నారు. అయితే దేశంలో సరిపడా నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని కేంద్రం ప్రకటించింది. నిల్వల వల్ల అగ్ని ప్రమాదాలు జరగొచ్చని హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించే పెట్రోల్ బంకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. వాహనాల్లో మాత్రమే ఇంధనం నింపుకోవాలని సూచించింది.