News August 28, 2024
అనంత: ‘కోడిగుడ్లలో పురుగులు.. మీరూ చూడండి’

కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కంబదూరు, కుందుర్పి, సెట్టూరు, బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం మండలాలలో ఉన్న పాఠశాలలకు అందజేస్తున్న కోడిగుడ్లలో పురుగులు ఉన్నట్లు విద్యార్థులు, ఉపాధ్యాయులు మంగళవారం తెలిపారు. ఇలాంటి గుడ్లు తినడం వల్ల అనారోగ్యానికి గురవుతామని విద్యార్థులు వాపోతున్నారు. మంగళవారం గుడ్లు తీసుకునే సమయంలో ఓ కోడిగుడ్డు కింద పడిపోవడంతో పగిలింది. అందులో నుంచి పురుగులు బయటపడ్డాయని తెలిపారు.
Similar News
News January 14, 2026
పామిడిలో పండగపూట విషాదం

పామిడిలో పండగపూట విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని వెంగమ నాయుడు కాలనీకి చెందిన కువకుడు ద్వారక గజిని పట్టణ శివారులోని 44 హైవేపై రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News January 14, 2026
JNTU ACEA క్యాంపస్ ఫలితాలు విడుదల

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో డిసెంబర్ నెలలో నిర్వహించిన M.Tech 2-1 (R21), MCA 1-1, 2-1 (R20) రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ప్రిన్సిపల్ పి.చెన్నారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ వసుంధరతో కలిసి విడుదల చేశారు. విద్యార్థులు ఫలితాల కోసం కళాశాలలోని అకాడమిక్ సెక్షన్ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో HODలు రామశేఖర్ రెడ్డి, అజిత, కళ్యాణి రాధా, భారతి, జరీనా, కళ్యాణ్ కుమార్ పాల్గొన్నారు.
News January 13, 2026
అరటి ఎగుమతిపై ప్రత్యేక చర్యలు

జిల్లాలో ఉద్యాన పంటల అభివృద్ధి, అరటి ఎగుమతుల ప్రోత్సాహానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శివ్ నారాయణన్ శర్మ తెలిపారు. అమరావతి నుంచి జరిగిన జూమ్ కాన్ఫరెన్స్లో రైలు మార్గం ద్వారా అరటి ఎగుమతులపై సమీక్ష నిర్వహించారు. రవాణా ఖర్చులు తగ్గించడం, లాజిస్టిక్స్ మద్దతు పెంపు, రైతులకు లబ్ధి చేకూర్చే అంశాలపై చర్చ జరిగింది. రైళ్లను నిరంతరం నడిపి అరటి ఎగుమతులు సకాలంలో జరగాలన్నారు.


