News August 28, 2024
శ్రీకాకుళం: జిల్లా వ్యాప్తంగా 1.19 లక్ష పశువులకు టీకాలు

శ్రీకాకుళం జిల్లాలో ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 1,19,246 పశువులకు టీ కాలు వేసామని జిల్లా పశుసంవర్థక సంయుక్త సంచాలకులు డా.వి.జయరాజు ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం కోటబొమ్మాలి మండల పరిధిలోని పలు గ్రామాల్లో మంగళవారం 593 పశువులకు టీకాల కార్యక్రమాలు నిర్వహించారు. సహాయ సంచాలకులు డా.లోకనాధం, డా.లఖినేని కిరణ్ కుమార్, ప్రజ్ఞ, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 11, 2026
ఎచ్చెర్ల: రిజల్ట్స్ విడుదల

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ 3వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లమెంటరీ పరీక్షల ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఈ మేరకు యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారి డాక్టర్ అనురాధ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఫలితాలను యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు ఆమె వెల్లడించారు. https://brau.edu.in/ వెబ్‌సైట్‌ను విద్యార్థులు చూడాలని పేర్కొన్నారు.
News March 11, 2026
శ్రీకాకుళం: కొనసాగుతున్న ఏసీబీ దాడులు

రాష్ట్ర వ్యాప్త దాడుల్లో భాగంగా శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ సెక్షన్లో ఏసీబీ అధికారులు మంగళవారం విస్తృతంగా తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. బుధవారం సైతం ఏసీబీ సీఐలు రమణ, భాస్కర్ రావుతో కూడిన బృందం పట్టణంలో టౌన్ ప్లానింగ్ సెక్షన్ అనుమతులు ఇచ్చిన భవనాలు, నిర్మాణ నిబంధనలు వంటివి పరిశీలిస్తున్నారు. రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించనున్నట్లు సమాచారం.
News March 11, 2026
శ్రీకాకుళం: ఆగి ఉన్న కారును ఢీకొన్న లారీ

శ్రీకాకుళం మండలం జాతీయ రహదారిలో ఉన్న డెంటల్ కాలేజీ వద్ద బుధవారం ఆగి ఉన్న కారును లారీ ఢీకొంది. కారు మరమ్మతులకు గురికావడంతో కారులో ఉన్నవారు దిగి మెకానిక్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ సమయంలోనే నరసన్నపేట నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న లారీ కారును ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయాడు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు.


