News August 28, 2024

వీకోట: బీన్స్ పొలంలో గంజాయి సాగు

image

అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను గుర్తించి ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ సోమశేఖర్ రెడ్డి తెలిపారు. రామకుప్పానికి చెందిన కృష్ణనాయక్, రాజేంద్రనాయక్ గంజాయి అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకొని విచారించారు. కర్రిపల్లెకు చెందిన ఆనందప్ప అనే రైతు తన బీన్స్ పొలంలో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు గుర్తించారు. వీరి నుంచి దాదాపు 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు.

Similar News

News September 29, 2024

SVU : LLB ఫలితాలు విడుదల

image

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది జూన్ నెలలో 3/ 5 LLB ( NON – CBCS) 6, 9 సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్ష విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను http://www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News September 29, 2024

చిత్తూరు: జిల్లా ప్రజలకు గమనిక.

image

అక్టోబర్ నెలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లు లబ్ధి దారుల ఇంటి వద్దకే సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ ల పంపిణీ జరుగుతుందని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలో 2,69,677 మందికి సుమారు రూ.113.77 కోట్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.అక్టోబర్ 1వ, 3వ తేదీలలో మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుందని,అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా సెలవు దినంతో 3 వ తేదీ పంపిణీ చేస్తామని చెప్పారు.

News September 29, 2024

శ్రీవారి సేవకు రూ.కోటి టికెట్

image

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడిని దర్శించుకోవాలనుకునే భక్తులెందరో ఉన్నారు. అలావచ్చే భక్తులు శ్రీవారిని కళ్లారా చూడ్డానికి ఎన్నోరకాల ఆర్జితసేవలు ఉన్నాయి. వాటిల్లో ప్రత్యేకమైన సేవ ఒకటి ఉంది. అదే శ్రీవారి ఉదయాస్తమానసేవ. ఈసేవ టికెట్ ధర అక్షరాల రూ.కోటి. ఈటికెట్ కొనుగోలుచేసిన భక్తులు ఆరోజును బట్టి సుప్రభాతం, తోమాల, అర్చన, అభిషేకం అష్టదళపాదపద్మారాధన ఉంటుంది. వివరాలకు TTD వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.