News August 28, 2024

డీఎస్సీ ఫైనల్ కీ ఎప్పుడంటే?

image

TG: డీఎస్సీ పరీక్షల ఫైనల్ కీని వచ్చే నెల 2న రిలీజ్ చేసేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. అనంతరం జిల్లాల వారీగా ర్యాంకుల జాబితాను వెల్లడించనుంది. రిజర్వేషన్ల ప్రకారం 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ధ్రువపత్రాల పరిశీలనకు పిలవనుంది. ఆ తర్వాత మెరిట్ ఉన్న వారికి జాయినింగ్ ఆర్డర్స్‌ను అధికారులు ఇవ్వనున్నారు. మొత్తం 11,062 పోస్టులకు జులై 18 నుంచి ఆగస్టు 5వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.

Similar News

News January 12, 2026

Q3 ఫలితాలు ప్రకటించిన TCS.. భారీగా డివిడెండ్

image

టీసీఎస్ Q3 ఫలితాలను ప్రకటించింది. FY 2025-26 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి రూ.10,657 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసినట్లు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంతో(Q3-రూ.12,380) పోలిస్తే 14% నికరలాభం తగ్గినట్లు తెలిపింది. అయితే ఆదాయంలో మాత్రం 5శాతం వృద్ధితో రూ.67,087 కోట్లకు చేరింది. 11,151 మంది ఉద్యోగులు తగ్గిపోగా ఇన్వెస్టర్లకు డివిడెండ్ ప్రకటించింది. ఒక్కో షేర్‌పై రూ.57 చెల్లించేందుకు ఆమోదం తెలిపింది.

News January 12, 2026

డీఏపై జీవో విడుదల

image

TG: ప్రభుత్వ ఉద్యోగుల <<18837053>>డీఏ 3.64%<<>> పెంచుతూ సర్కారు జీవో విడుదల చేసింది. 2023 జులై 1 నుంచి ఇది వర్తించనుంది. పెరిగిన డీఏ జనవరి నెల వేతనంతో కలిపి ఫిబ్రవరి 1న చెల్లించనున్నారు. 2023 జులై 1 నుంచి 2025 డిసెంబర్ 31 వరకు డీఏ బకాయిలు GPF ఖాతాలో జమ చేయనున్నారు. మున్సిపాలిటీ ఉద్యోగుల నుంచి యూనివర్సిటీ ప్రొఫెసర్ల వరకు అందరి జీతాలు పెరగనున్నాయి.

News January 12, 2026

సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ టెస్ట్ అడ్మిట్ కార్డులు విడుదల

image

ఆలిండియా సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. వాటిని <>వెబ్‌సైట్‌లో<<>> డౌన్‌లోడ్ చేసుకోవాలని NTA తెలిపింది. దేశవ్యాప్తంగా 464 కేంద్రాల్లో ఈ నెల 18న పరీక్ష జరగనుందని పేర్కొంది. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌లో ఇబ్బందులుంటే 011-40759000, 011-69227700 నంబర్లలో, aissee@nta.ac.inలో సంప్రదించాలని సూచించింది. ఈ ఎగ్జామ్ ద్వారా 2026-27లో 6, 9 తరగతుల్లో ప్రవేశాలు కల్పించనుంది.