News August 28, 2024
Rewind: ఆగస్టు 28.. ఉలిక్కిపడ్డ హైదరాబాద్

28-08-2000 రోజు HYD ఉలిక్కిపడింది. విద్యుత్ ఛార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఛలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టారు. ర్యాలీ బషీర్‌బాగ్‌కు చేరగానే పరిస్థితి అదుపుతప్పింది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీఛార్జి, టియర్ గ్యాస్, బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ కాల్పుల్లో రామకృష్ణ, విష్ణువర్ధన్, బాలస్వామి చనిపోయారు. నేడు ఆ అమరులకు కామ్రేడ్‌లు నివాళి అర్పిస్తున్నారు.
Similar News
News April 3, 2026
HYD: దారుణ హత్య.. మూసీలో ఎముకల లభ్యం

HYD శివారు మేడిపల్లి PS పరిధిలో అదృశ్యమైన వ్యక్తి హత్యకు గురయ్యాడు. చెంగిచర్ల గణేష్‌నగర్‌కు చెందిన పండిపాటి బక్కయ్య (33) గతేడాది DEC30న పనికి వెళ్లి కనిపించకుండా పోయాడు. JAN21న మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. కొర్రెముల మూసీ వంతెన వద్ద సంచిలో ఎముకలు స్వాధీనం చేసుకున్నారు. పని ప్రాంత వివాదమే హత్యకు కారణమని నిర్ధారించారు.
News April 3, 2026
HYDలో ట్రాఫిక్ జామ్.. కారణం ఇదే!

ఐటీ కారిడార్‌లోని సైబర్ టవర్స్ వద్ద మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన సర్వేలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. ఉదయం వేళ కేవలం ఒక గంటలోనే ఏకంగా 10,138 మంది ఒంటరి వాహనదారులు (సింగిల్ రైడర్లు) వెళ్లినట్లు గుర్తించారు. డబుల్ రైడర్లు 3,584 మంది మాత్రమే ఉన్నారని తేలింది. ఈ స్థాయిలో సింగిల్ రైడర్ల సంఖ్య పెరగడం వల్లే రోడ్లపై తీవ్ర ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు.
News April 3, 2026
HYD: ఇద్దరు IAS అధికారులకు పోస్టింగ్‌లు

తెలంగాణలో ఇద్దరు ఐఏఎస్ అధికారులకు పోస్టులు కేటాయిస్తూ సీఎస్ రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు. వాణి ప్రసాద్‌ను యువజన అభివృద్ధి, పర్యాటకం, సంస్కృతి శాఖకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించారు. జయేష్ రంజన్ అర్బన్ డెవలప్మెంట్ శాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కొనసాగుతూ.. క్రీడా శాఖకు అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.


