News August 28, 2024
కాంగ్రెస్, బీజేపీ బెదిరింపులకు కేసీఆర్ లొంగరు: శ్రీనివాస్ గౌడ్

కల్వకుంట్ల కవిత బెయిల్ తప్పు పట్టే విధంగా మాట్లాడడం సరికాదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ అక్కసు వెళ్లగక్కుతున్నాయని విమర్శించారు. కేసీఆర్ చావడానికైనా సిద్ధం కానీ.. ఆ పార్టీల బెదిరింపులకు లొంగరని అన్నారు. న్యాయమూర్తులు అన్ని విషయాలు విచారించిన తర్వాత బెయిల్ మంజూరు చేశారని, అనవసరపు ఆరోపణలు చేస్తే ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం పోతుందని నేతలపై మండిపడ్డారు.
Similar News
News March 13, 2026
MBNR: ఈనెల 15 నుంచి అంబేడ్కర్ వర్సిటీ తరగతులు

మహబూబ్‌నగర్ ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ సెమిస్టర్ II, IV, VI తరగతులు ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. 80 శాతం హాజరు ఉన్న విద్యార్థులనే పరీక్షలకు అనుమతిస్తామని ప్రిన్సిపల్ డాక్టర్ పద్మావతి తెలిపారు. మరిన్ని వివరాల కోసం 73829 29609 నంబరును సంప్రదించాలని కోరారు.
News March 13, 2026
MBNR: పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలు: SP

పదో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. పరీక్షా సమయాల్లో (ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు) కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో 163 BNSS యాక్ట్ ప్రకారం ఐదుగురికి మించి గుంపులుగా ఉండకూడదని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
News March 13, 2026
మహబూబ్‌నగర్: ఫలించని జశ్వంత్ ప్రయత్నం

భూత్పూర్ మండలం వెల్కిచర్లలో గురువారం ఓ తల్లి పిల్లలతోకలిసి బావిలోదూకి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన ఆమె కుమారుడు జశ్వంత్( 8)వారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నంపట్ల గ్రామస్థులు ప్రశంసిస్తున్నారు. బాలుడు బావిలోని ఎత్తు ప్రదేశంలో పడటంతో ఒడ్డుకుచేరుకొని వెంటనే గ్రామంలోకి వెళ్లి గ్రామస్థులకు చెప్పడంతో గాలింపు చేపట్టారు. కానీ అప్పటికే తల్లి, కూతుళ్లు మృతి చెందారు.


