News August 28, 2024
VZM: ఈవీఎంల తనిఖీ.. అసలు డౌట్ ఎందుకంటే?

జిల్లాలో <<13957186>>EVM<<>> రీవెరిఫికేషన్ జరుగుతున్న సంగతి తెలిసిందే. పోలింగ్ రోజు సాయంత్రం బ్యాటరీ స్టేటస్ 50% ఉండగా, 21 రోజుల తరువాత కౌంటింగ్ నాటికి ఛార్జింగ్ 99 శాతానికి చేరుకున్నట్లు గజపతినగరం నియోజకవర్గంలో YCP ఏజెంట్లు గుర్తించారు. మాజీ ఎమ్మెల్యే అప్పలనరసయ్య, మాజీ ఎంపీ బెల్లాన ఈసీకి ఫిర్యాదు చేయడంతో ఈ తనిఖీలు ప్రారంభమయ్యాయి. తనిఖీపై స్పష్టత రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని బెల్లాన ప్రకటించారు.
Similar News
News September 16, 2025
సీఎం సమీక్షలో విజయనగరం జిల్లా నూతన రథసారథులు

రాష్ట్రంలో వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం చంద్రబాబు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ మంగళవారం నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో జిల్లా నూతన కలెక్టర్ ఎస్.రామ సుందరరెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్ పాల్గొన్నారు. జిల్లాలో చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.
News September 16, 2025
పేదరిక నిర్మూలనే పీ-4 లక్ష్యం: VZM జేసీ

పేదరిక నిర్మూలనే పీ-4 కార్యక్రమం ప్రధాన లక్ష్యమని జేసీ ఎస్.సేతు మాధవన్ స్పష్టం చేశారు. మార్గదర్శులు బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని, వారిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని కోరారు. పీ-4 కార్యక్రమం, బంగారు కుటుంబాలు, మార్గదర్శుల పాత్రపై సచివాలయం నుంచి ఎంపిక చేసిన ఎంవోటీ, టీవోటీలకు కలెక్టరేట్లో మంగళవారం శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.
News September 16, 2025
VZM: ప్రత్యేక అలంకరణలో పైడిమాంబ

ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు విజయనగరం శ్రీపైడితల్లి అమ్మవారిని ఆలయ అర్చకులు సుందరంగా అలంకరించారు. మంగళవారం సందర్భంగా ప్రధాన ఆలయంతో పాటు చదురు గుడిలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు జరిపించి వివిధ రకాల పుష్పాలతో ముస్తాబు చేశారు. అనంతరం కుంకుమ పూజలు నిర్వహించి భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. సిరిమానోత్సవాల్లో భాగంగా ప్రత్యేక అలంకరణలో అమ్మవారు శోభిల్లుతున్నారు.