News August 28, 2024

రేపు కడప జిల్లాకు రానున్న మాజీ ఉపరాష్ట్రపతి

image

భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గురువారం ఎర్రగుంట్ల మండలం కలమలకు రానున్నారు. తెలుగు భాషా దినోత్సవాన్ని కలమలలో ఘనంగా నిర్వహించేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి వెంకయ్య ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. రేపు ఉదయం హైదరాబాదు నుంచి విమానంలో బయలుదేరి రేణిగుంటకు చేరుకొని, అక్కడి నుంచి రైలులో 11.35కు ఎర్రగుంట్లకు వస్తారు. అనంతరం రోడ్డు మార్గాన కలమలకు చేరుకుంటారు.

Similar News

News March 13, 2026

పొద్దుటూరులో నేటి బంగారు వెండి ధరల వివరాలు ఇలా.!

image

పొద్దుటూరు బులియన్ మార్కెట్లో శుక్రవారం బంగారు, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.15,780
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.14,518
*వెండి 10 గ్రాముల ధర రూ.2,665

News March 13, 2026

ప్రొద్దుటూరు: పిజ్జా సర్వర్‌కి గోల్డ్ మెడల్

image

పేదరికం చదువుకు అడ్డంకి కాదని నిరూపించింది ప్రొద్దుటూరుకు చెందిన సువర్ణరెడ్డి తోట సువర్ణ, YV విశ్వవిద్యాలయంలో 2019–2021 విద్యా సంవత్సరంలో MA హిస్టరీ పూర్తి చేసి ప్రతిభ కనబర్చింది. నేడు వైవీయూ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆమెకు గోల్డ్ మెడల్ అందజేయనున్నారు. చదువు పూర్తయ్యాక ఆర్థిక ఇబ్బందుల కారణంగా.. పిజ్జా సర్వర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆమె భర్త కూడా దినసరి కూలీగా జీవనం సాగిస్తున్నాడు.

News March 13, 2026

కడప: వంట గ్యాస్ బ్లాక్‌లో అమ్మితే చర్యలే

image

కడప జిల్లాలో వంట గ్యాస్ బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ నిధి మీనా హెచ్చరించారు. వంట గ్యాస్ డిమాండ్, సరఫరా, పంపిణీ, కృత్రిమ కొరత, బ్లాక్ మార్కెట్ తదితర వాటిపై గురువారం కడపలో జేసీ సంబంధిత అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, డీలర్లతో సమీక్ష నిర్వహించారు. వంట గ్యాస్ పక్క దారి పట్టకుండా ఏజెన్సీలు డెలివరీ సిబ్బందిపై నిరంతరం పటిష్టమైన నిఘా పెట్టాలన్నారు.