News August 28, 2024
జన్‌ధన్.. కోట్లాది మందికి గౌరవం: మోదీ

జన్‌ధన్ యోజన ఆర్థిక సమ్మిళితత్వం పెంచిందని, కోట్లాది మందికి గౌరవం కల్పించిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ‘ఇదో అద్భుత సందర్భం. జన్‌ధన్ యోజనకు పదేళ్లు. లబ్ధిదారులు, పథకం విజయవంతం అయ్యేలా కృషిచేసిన అందరికీ ధన్యవాదాలు. ఆర్థిక సమ్మిళితత్వం, మహిళలు, యువత, అణగారిన వర్గాల గౌరవాన్ని పెంచేందుకు ఈ పథకం కీలకంగా మారింది’ అని మోదీ ట్వీట్ చేశారు. గ్యాస్, ఇతర స్కీముల్లో నగదు బదిలీకి ఈ స్కీమ్ బాగా ఉపయోగపడింది.
Similar News
News September 16, 2025
ఆస్కార్ విన్నర్, హాలీవుడ్ ఐకాన్ రాబర్ట్ రెడ్ఫోర్డ్ మృతి

హాలీవుడ్ లెజెండ్, ఆస్కార్ అవార్డు విన్నింగ్ నటుడు & డైరెక్టర్ రాబర్ట్ రెడ్ఫోర్డ్ (89) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఆయన మరణించినట్లు రాబర్ట్ సన్నిహితుడు సిండి బెర్గర్ వెల్లడించారు. 1960 నుంచి ఇంగ్లిష్ సినిమాలకు ఆయన నటుడు, నిర్మాత, దర్శకుడిగా సేవలందించారు. కెప్టెన్ అమెరికా, అవెంజర్స్ ఎండ్ గేమ్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో ఆయన కీలక పాత్రల్లో నటించారు.
News September 16, 2025
BREAKING: మధుయాష్కీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

TG: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు ఛాంబర్లో ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే ఆయనకు సచివాలయంలోని డిస్పెన్సరీలో తక్షణ వైద్యం అందించారు. అనంతరం గచ్చిబౌలిలోని AIG ఆస్పత్రికి తరలించారు. కాగా మధుయాష్కీకి ప్రమాదమేమీ లేదని, బీపీ పెరిగి కళ్లు తిరిగి కిందపడ్డారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
News September 16, 2025
కిచెన్ గార్డెనింగ్ ఇలా చేసేద్దాం..

కిచెన్ గార్డెనింగ్ చేయాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. కిచెన్ ప్లాంట్స్కి 3-6 గంటల సూర్యరశ్మి అవసరం. వీటిని బాటిల్స్, గ్లాస్ కంటైనర్స్‌లో పెంచొచ్చు. సారవంతమైన మట్టి, మంచి విత్తనాలు వాడాలి. అప్పుడే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఆకుకూరలు, టమాటా, మిర్చి, అల్లం, బంగాళదుంప ఈజీగా పెరుగుతాయి. వీటికి సరిపడా నీరు పోయాలి. కుండీల కింద రంధ్రాలు ఉండేలా చూసుకోవాలి. వీలైనంత వరకూ రసాయనాలు, పురుగుమందులు వాడకూడదు.