News August 28, 2024

ఈ ఎడారిలో దారి మరిస్తే అంతే సంగతులు!

image

ఇటీవల తెలంగాణకు చెందిన ఓ యువకుడు రబ్ అల్ ఖలి ఎడారిలో దారి తప్పి మరణించాడు. కాగా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ప్రమాదకరమైన ఎడారి. 650 కి.మీ పొడవున సౌదీ, ఒమన్, యెమెన్, UAE దేశాల్లో ఇది విస్తరించి ఉంది. భారీ ఇసుక దిబ్బలు, ప్రమాదకర పాములు ఉంటాయి. ఇక్కడ తాగేందుకు గుక్కెడు నీరు కూడా ఉండదు. దారి తప్పిన వారికి సాయం చేసేందుకు ఎవరూ ఉండరు. ఇప్పటివరకు దీనిని దాటినవారిని వేళ్ల మీదనే లెక్కించొచ్చు.

Similar News

News November 10, 2025

గజగజ వణికిస్తున్న చలి.. జాగ్రత్త!

image

తెలుగు రాష్ట్రాల్లో చలి విపరీతంగా పెరిగింది. రాత్రి నుంచి ఉదయం వరకు గజగజ వణికిస్తోంది. APలోని ఏజెన్సీలో పొగమంచు దట్టంగా కురుస్తోంది. నిన్న అల్లూరి(D) జి.మాడుగులలో అత్యల్పంగా 11.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు TGలో HYD శివారు పటాన్‌చెరులో కనిష్ఠంగా 13.2 డిగ్రీల టెంపరేచర్ రికార్డయింది. రాబోయే రోజుల్లో చలి మరింత పెరుగుతుందని, చిన్నారులు, వృద్ధులు, రోగులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

News November 10, 2025

స్లీపింగ్ మాస్క్‌లు వాడుతున్నారా?

image

స్కిన్‌కేర్‌లో భాగంగా చాలామంది స్లీపింగ్ మాస్క్‌లు వాడటం ఎక్కువైంది. అయితే వీటిని ఎక్కువగా వాడటం నష్టమే అంటున్నారు నిపుణులు. ఈ మాస్కులు లైట్ క్రీమ్, జెల్‌తో ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి. కానీ వీటిని రోజూ వాడటం వల్ల చర్మం ఎక్కువ ఆయిల్‌ను ఉత్పత్తి చేస్తుందంటున్నారు నిపుణులు. సహజ తేమను కోల్పోయి, మొటిమలు వచ్చే ప్రమాదం పెరుగుతుందంటున్నారు. వారానికి 2సార్లు వాడటం మంచిదని సూచిస్తున్నారు.

News November 10, 2025

శ్రీశైలంలో ఈనెల 14న కోటి దీపోత్సవం

image

AP: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో తొలిసారిగా ఈ నెల 14న కోటి దీపోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు ఉచితంగా పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నామని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. దీపోత్సవానికి అవసరమైన పూజా సామగ్రిని దేవస్థానమే అందజేస్తుందని పేర్కొన్నారు. ఇందులో పాల్గొనేందుకు పరిపాలన భవనంలోని శ్రీశైల ప్రభ కార్యాలయంలో 12వ తేదీలోపు వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.