News August 28, 2024
MLG: గ్రేట్.. వైకల్యాన్ని లెక్కచేయక..

అన్ని అవయవాలు ఉన్న వారే చిన్న చిన్న సమస్యలకే కుమిలిపోతూ వ్యసనాలకు బానిస అవుతున్నారు. అలాంటిది మిర్యాలగూడకి చెందిన కంచర్ల శ్రీనివాస పవన్‌కు పుట్టుకతోనే కుడి చేయి మణికట్టు వరకు మాత్రమే ఉంది. దివ్యాంగులకు నిర్వహించే పారా బ్యాడ్మింటన్ పోటీల గురించి తెలుసుకొని అందులో రాణించాడు. రాష్ట్ర స్థాయి పారా బ్యాడ్మింటన్ పోటీల్లో బంగారు పతకాలు సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.
Similar News
News September 15, 2025
NLG: 17 నుంచి పోషణ మాసం షురూ

ఆరోగ్యకర సమాజ నిర్మాణంతో పాటు మాతా శిశు సంరక్షణ కోసం అధికారులు పోషణ మాసం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోషణ్ అభియాన్ ప్రజల భాగస్వామ్యంతో నడిచే ఉద్యమంగా భావించి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ నల్గొండ జిల్లాలోని 2,093 అంగన్వాడి కేంద్రాల్లో ఈనెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు పోషణ మాసం నిర్వహించనుంది. అంగన్వాడి కేంద్రాల్లో పిల్లల ఎత్తు, బరువు చూసి రిజిస్టర్లో నమోదు చేయనున్నారు.
News September 15, 2025
NLG: సిరులు కురిపించనున్న తెల్ల బంగారం..!

పత్తి సాగు నల్గొండ జిల్లా రైతులకు సిరులు కురిపించనుంది. జిల్లాలో ఈ ఏడాది వ్యవసాయ శాఖ అంచనాలకు మించి రైతులు పత్తి పెద్ద ఎత్తున సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా 5,47,735 ఎకరాల్లో పత్తి సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేయగా అంచనాకు మించి 5,64,585 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. జిల్లాలో మొదటి దశ పత్తితీత పనులను ఇటీవల రైతులు ప్రారంభించారు. 45 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా.
News September 15, 2025
మూసీకి తగ్గిన వరద

మూసీ నదికి వరద ప్రవాహం తగ్గింది. ప్రాజెక్ట్‌లోకి ప్రస్తుతం 4,385.47 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, అంతే మొత్తంలో నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 643.70 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి సామర్థ్యం 4.46 టీఎంసీలకు గాను 4.12 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అధికారులు 3 క్రస్ట్ గేట్లను 2 ఫీట్ల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు.