News August 28, 2024
All time high: 25110 వద్ద నిఫ్టీ రికార్డ్

స్టాక్ మార్కెట్లు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. ఇంట్రాడేలో 25,110 వద్ద NSE నిఫ్టీ సరికొత్త జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. వడ్డీరేట్ల కోతకు టైమొచ్చిందన్న US ఫెడ్ వ్యాఖ్యలు, ఐటీ షేర్ల జోరు ఇందుకు దోహదం చేశాయి. వరుసగా 10 సెషన్ల నుంచి సూచీ పెరగడం గమనార్హం. ఐటీ సూచీ 2.28% పెరిగి 42,660 వద్ద చలిస్తోంది. LTI మైండ్‌ట్రీ, విప్రో, LTTS, కోఫోర్జ్, ఇన్ఫీ, పర్సిస్టెంట్ సిస్టమ్స్ షేర్లు అదరగొడుతున్నాయి.
Similar News
News November 10, 2025
వాళ్లు మూల్యం చెల్లించాల్సిందే: లోకేశ్

AP: తిరుమల కల్తీ నెయ్యి కేసులో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ‘సిట్’ నిజాన్ని బట్టబయలు చేసిందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ‘కల్తీ నెయ్యి కేసులో దోషులకు కఠిన శిక్షలు తప్పవు. ఇది కల్తీ కాదు.. హిందువుల నమ్మకం, భారత దేశ ఆత్మవిశ్వాసంపై ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి. తిరుమల పవిత్రతను దెబ్బతీసిన వాళ్లు తప్పక మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఓం నమో వేంకటేశాయ’ అని ట్వీట్ చేశారు.
News November 10, 2025
మీకు ఇలాంటి కాల్స్ వస్తున్నాయా?

తాము టెలికాం శాఖ అధికారులమని చెప్పి సైబర్ నేరగాళ్లు సామాన్యులను మోసం చేస్తున్నారు. ‘మీ ఫోన్ నంబర్-ఆధార్ లింక్ కాలేదు. మేం చెప్పినట్లు చేయకపోతే మీ నంబర్ బ్లాక్ చేస్తాం’ అంటూ బెదిరిస్తున్నారు. వివరాలు చెప్పగానే ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. అయితే టెలికాం శాఖ అలాంటి కాల్స్ చేయదని, ఎవరూ భయపడొద్దని PIB Fact Check స్పష్టం చేసింది. cybercrime.gov.in లేదా 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించింది.
News November 10, 2025
పిల్లల్ని కనేముందు కౌన్సిలింగ్ అవసరం

పెళ్లి తర్వాత పిల్లల ప్లానింగ్‌కు ముందు భార్యాభర్తలు కౌన్సెలింగ్ తీసుకోవడం ద్వారా అనవసర భయాలు తొలగిపోతాయంటున్నారు నిపుణులు. మధుమేహం, థైరాయిడ్, అధిక రక్తపోటు లాంటి సమస్యలుంటే ముందే గుర్తించి చికిత్స తీసుకోవాలి. సహజంగా గర్భం దాల్చలేకపోతే దంపతులిద్దరూ వైద్యులను సంప్రదించాలి. అలాగే కౌన్సిలింగ్ తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ, పేరెంటింగ్‌పై అవగాహన పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.


