News August 28, 2024
BREAKING: హైడ్రాపై సీఎం కీలక వ్యాఖ్యలు
TG: అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘హైడ్రా తన పని తాను చేసుకుపోతుంది. ఎవరినీ వదిలిపెట్టేది లేదు. ORR అవతల ఉన్న గ్రామ పంచాయతీలు కూడా హైడ్రా పరిధిలో ఉన్నాయి. ఫామ్‌హౌస్‌లు కట్టుకున్న కొందరు సెలబ్రిటీలు మురికినీటిని ఉస్మాన్, హిమాయత్‌సాగర్‌లోకి వదులుతున్నారు. హైడ్రాకు పోలీస్ స్టేషన్ స్టేటస్ ఇస్తాం’ అని ఆయన వెల్లడించారు.
Similar News
News January 31, 2025
బాత్రూమ్లోనే టూత్‌బ్రష్ పెడుతున్నారా?
దంతాలను శుభ్రం చేసుకున్నాక <<15261921>>టూత్‌బ్రష్‌లను<<>> బాత్రూమ్లోనే పెట్టడం ప్రమాదమని సిద్దిపేట GOVT డిగ్రీ కాలేజీ విద్యార్థుల అధ్యయనంలో తేలింది. కమోడ్ ఫ్లష్ చేసినప్పుడు నీతి తుంపర్ల ద్వారా 3రకాల బ్యాక్టీరియా బ్రష్‌లపైకి చేరుతోందని గుర్తించారు. స్ట్రెప్టోకోకస్ వల్ల దంతాల అరుగుదల, స్టెఫైలోకోకస్ ఆర్యస్తో మౌత్ అల్సర్, ఈ-కొలి వల్ల జీర్ణ సమస్యలు వస్తున్నాయని చెప్పారు. బ్రష్‌లను ఎండ తగిలే చోట పెట్టాలంటున్నారు.
News January 31, 2025
రేపటి నుంచే భూముల మార్కెట్ ధరల పెంపు
APవ్యాప్తంగా రేపటి నుంచి భూముల మార్కెట్ ధరలు, రిజిస్ట్రేషన్ రేట్లు పెరగనున్నాయి. ఆయా ప్రాంతాల అభివృద్ధి ప్రాతిపదికన 10-20% పెంపు ఉండనుంది. నగర పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో నిర్మాణ విలువలపైనా 6% వరకు పెంపు ఉంటుంది. పెంకుటిళ్లు, రేకుల షెడ్లు, ఇతర వాటికి చదరపు అడుగుకు ₹740, ₹580, ₹420 వసూలు చేస్తారు. ప్లాట్లకు(G,1st, 2nd ఫ్లోర్)రూ.1,490, రూ.1,270, రూ.900 వసూలుకు నిర్ణయించారు.
News January 31, 2025
లిక్కర్ స్కాంలో కవిత: కేరళ ప్రతిపక్ష నేత
TG: ఢిల్లీ తరహాలో కేరళలోనూ లిక్కర్ స్కామ్ జరిగిందని, ఇందులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక పాత్ర పోషించారని ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ ఆరోపించారు. ‘పాలక్కడ్‌లోని ఒయాసిస్ కమర్షియల్ కంపెనీకి మద్యం తయారీ పర్మిషన్ ఇచ్చారు. సీఎం పినరయి, ఎక్సైజ్ మంత్రి రాజేశ్ ఏకపక్షంగా అనుమతులు ఇచ్చారు. ఈ వ్యవహారాన్ని కవితనే కేరళకు వచ్చి మరీ నడిపించారు’ అని చెప్పారు. ఈ వ్యాఖ్యలను కవిత ఖండించారు.