News August 28, 2024
సంగారెడ్డి: ALERT.. కాన్ఫరెన్స్‌లో పెట్టి కాజేశారు

ఎల్‌ఐసీ పాలసీ పూర్తయినందున డబ్బులు అకౌంట్‌లో వేస్తామని న్యాల్కల్(M) బసంతపూర్‌కి చెందిన వెంకట్‌రెడ్డికి ఫోన్ వచ్చింది. బ్యాంకు ఖాతా నంబర్ చెప్పాలని కోరగా వెంటనే ఇచ్చాడు. అందులో డబ్బు లేదని, కనీసం రూ.3 వేలు ఉండాలని సైబర్ నేరగాడు చెప్పాడు. డబ్బులు వేస్తామని, వేరే వారి నంబర్ ఇవ్వాలని అడగ్గా అతడు సుదర్శన్‌రెడ్డికి కాన్ఫరెన్స్ కలిపాడు. అతడిని మాటల్లో పెట్టి ఖాతా నుంచి రూ.99 వేలు కొట్టేశాడు.
Similar News
News March 14, 2026
జిల్లాస్థాయి ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ ఏర్పాటు: కలెక్టర్

జిల్లాలో వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ల సరఫరా నిరంతరాయంగా జరిగేలా చూసేందుకు ‘జిల్లా స్థాయి ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ’ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. సీఎస్ సూచనల మేరకు తన అధ్యక్షతన ఈ కమిటీ పని చేస్తుందని పేర్కొన్నారు. ఇందులో ఎస్పీ, అదనపు కలెక్టర్, ఆయిల్ కంపెనీల మేనేజర్లు, ఆర్‌టీఓ, డిఎంహెచ్ఓ సభ్యులుగా ఉంటారని, గ్యాస్ కొరత లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తారని వివరించారు.
News March 14, 2026
మెదక్ జిల్లాలో 99.83% హాజరు నమోదు: డీఈవో

మెదక్ జిల్లాలో పదో తరగతి ఫస్ట్ లాంగ్వేజ్(తెలుగు) పరీక్ష మొదటి రోజు ప్రశాంతంగా ముగిసిందని డీఈవో విజయ తెలిపారు. హవేలీఘన్పూర్ మండలం మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలోని పరీక్షా కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. జిల్లాలో 11,239 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 11,220 మంది హాజరై 19 మంది గైర్హాజరయ్యారు. ఫెయిల్ అయిన వారిలో 14 మందికి 9 మంది పరీక్ష రాయగా హాజరు శాతం 99.83గా నమోదైందని పేర్కొన్నారు.
News March 14, 2026
మెదక్: తీవ్ర విషాదం.. కార్మికుడి మృతి!

శివంపేట్ మండలంలోని గోమారంలో విషాదం నెలకొంది. వీధి లైట్ల మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి పంచాయతీ కార్మికుడు నీరుడి రాములు (48) విద్యుత్ స్తంభం పైనుంచి కిందపడిపోయారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


