News August 28, 2024
పాత కార్లను స్క్రాప్ చేస్తే కొత్తవాటిపై ₹20,000 రాయితీ

పండుగ రోజుల్లో కొత్త కార్లు కొనుగోలు చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్. కాలం చెల్లిన పాత కార్లను స్క్రాప్‌గా మార్చి, ఆ సర్టిఫికెట్ చూపిస్తే కొత్తవాటిపై 1.5% లేదా ₹20,000 రాయితీ ఇవ్వడానికి ఆటోమొబైల్ కంపెనీలు అంగీకరించాయి. వాణిజ్య వాహనాలకు 3% రాయితీ వర్తిస్తుంది. కేంద్ర మంత్రి గడ్కరీ ప్రతిపాదనకు మారుతీ, టాటా, మహీంద్రా, హ్యుందాయ్, కియా, టయోటా, హోండా, రెనో, నిస్సాన్, స్కోడా తదితర కంపెనీలు ఓకే చెప్పాయి.
Similar News
News January 12, 2026
అగ్నివీర్ వాయు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News January 12, 2026
మినుములో పల్లాకు తెగులు లక్షణాలు – నష్టాలు

మినుము పంటలో పల్లాకు తెగులు సోకిన తొలి దశలో లేత పసుపు రంగు మచ్చలు ఏర్పడి, క్రమంగా అవి ముదురు పసుపు రంగులోకి మారతాయి. కొన్నిసార్లు ముదురు గోధుమ లేదా నలుపు రంగు మచ్చలు కూడా కనిపిస్తాయి. ఈ తెగులు వల్ల మొక్కలు గిడసబారి, ఎదుగుదల కుంటుపడుతుంది. పూత ఆలస్యంగా వస్తుంది లేదా ఎండిపోతుంది. కాయలు తక్కువ సంఖ్యలో వచ్చి వాటిపై కూడా మచ్చలు వస్తాయి. ఫలితంగా గింజల నాణ్యత, పరిమాణం తగ్గిపోతుంది.
News January 12, 2026
గరుడ పురాణం ఏం చెబుతుందంటే..?

గరుడ పురాణం మరణం తర్వాత ఆత్మ ప్రయాణం, కర్మ ఫలాలు, పునర్జన్మ గురించి వివరిస్తుంది. మనిషి బతికున్నప్పుడు చేసే పాపపుణ్యాలకు అనుగుణంగా యమలోకంలో ఎలాంటి శిక్షలు ఉంటాయో ఇందులో ఉంటుంది. సృష్టి రహస్యాలు, ధర్మ సూత్రాలు, ఔషధ గుణాలు, మోక్ష మార్గాలను కూడా ఇది బోధిస్తుంది. హిందూ సంప్రదాయంలో మరణానంతరం గరుడ పురాణ పారాయణం చేయడం వల్ల ఆత్మకు శాంతి, సద్గతులు కలుగుతాయని నమ్మకం. <<-se>>#GARUDAPURANAM<<>>


