News August 28, 2024

HYD: త్వరలో ఆర్టీసీలో 3,035 ఉద్యోగాలు

image

టీజీఎస్ఆర్టీసీలో కొలువుల భర్తీకి మరో రెండు, మూడు వారాల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కొత్త బస్సుల కొనుగోలు, ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే తొలి దశలో 3,035 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిర్ణయించామని, సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి ఆమోదం తెలిపారన్నారు.

Similar News

News August 31, 2025

HYD: ఈ జిల్లాల్లో క్యాన్సర్ కేర్ యూనిట్లు..!

image

క్యాన్సర్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. HYD, RR, MDCL, VKB జిల్లాల్లో క్యాన్సర్ కేర్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. HYD పరిధి MNJ క్యాన్సర్ ఆస్పత్రి, NIMS ఆసుపత్రులలో ప్రస్తుతం వైద్యం అందుబాటులో ఉండగా, వైద్య చికిత్స విస్తరణపై ఫోకస్ చేసిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

News August 31, 2025

HYD: పిల్లలకు మొబైల్ ఇస్తున్నారా? జాగ్రత్త

image

మీ పిల్లలకు ఫోన్ ఇస్తున్నారా? జాగ్రత్త! HYDలో నమోదైన పలు కేసుల్లో పిల్లల ప్రవర్తన వెనుక అనేక విషయాలు బయటపడ్డాయి. ఇటీవల కూకట్‌పల్లి బాలుడు OTTచూసి ప్రభావితం అయిన తీరు ఓ ఉదాహరణ. మీ పిల్లలు యూట్యూబ్ షాట్స్, ఇన్‌స్టా, షేర్‌చాట్, ఫేస్‌బుక్ లాంటివి చూస్తుండగా నేరాలు, పోర్న్, డ్రగ్స్, ఇతరత్రా అనవసరపు వీడియోలు రావడంతో వాటికి ఆకర్షితులై వారు చెడుదారి వైపు వెళ్తున్నట్లు తెలుస్తోంది.

News August 31, 2025

HYD: లడ్డూ దొంగలొస్తున్నారు.. జాగ్రత్త!

image

వినాయకచవితి నవరాత్రుల వేళ లడ్డూ దొంగల బెడద పెరిగింది. మీర్‌పేట PS పరిధి హస్తినాపురంలోని విశ్వేశ్వరయ్య ఇంజినీర్స్‌ కాలనీలో ఏకంగా 4 మండపాల్లో గణపతి లడ్డూలను ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి స్కూటీపై వచ్చిన యువకులు అదును చూసి చోరీ చేశారు. దీనిపై స్థానికులు PSలో ఫిర్యాదు చేశారు. మండపంలో నిద్రించే వాలంటీర్లు అప్రమత్తంగా ఉండాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే మంచిదని పోలీసులు సూచిస్తున్నారు.
SHARE IT