News August 28, 2024

వైద్యురాలిపై హత్యాచారం భయానకం: రాష్ట్రపతి

image

RGకర్ వైద్యురాలిపై హత్యాచారం కలచివేసిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. అది భయానకమని, ప్రస్తుతం స్త్రీలపై జరుగుతున్న దారుణాల్లో ఒకటని పేర్కొన్నారు. నాగరిక సమాజంలో మన కూతుళ్లు, సోదరీమణులపై అఘాయిత్యాలకు తావులేదన్నారు. అందుకే దేశం భగ్గుమంటోందని, తానూ అందులో ఒకర్నని అన్నారు. ‘కోల్‌కతాలో స్టూడెంట్స్, వైద్యులు, పౌరులు ఆందోళన చేస్తున్నా నేరగాళ్లు ఎక్కడో స్వేచ్ఛగా తిరుగుతున్నారు’ అని చెప్పారు.

Similar News

News November 8, 2025

USలో 10 లక్షలకు పైగా ఉద్యోగాల్లో కోత

image

AI, ఆటోమేషన్, ఇన్‌ఫ్లేషన్, టారిఫ్‌లు.. వెరసి US జాబ్ మార్కెట్ సంక్షోభంలో పడింది. OCTలో 1,53,074 జాబ్స్‌కు కోత పడినట్లు ‘ఛాలెంజర్ గ్రే క్రిస్టమస్’ తెలిపింది. SEPతో పోలిస్తే 3 రెట్లు అధికమని పేర్కొంది. 2025లో ఇప్పటివరకు లేఆఫ్‌ల సంఖ్య 1.09Mకు చేరినట్లు వెల్లడించింది. కరోనా తర్వాత అత్యధిక లేఆఫ్‌లు ఇవేనని చెప్పింది. కాగా గత 2 ఏళ్లతో పోలిస్తే జాబ్ మార్కెట్ ఇప్పుడే స్లో అయినట్లు నిపుణులు పేర్కొన్నారు.

News November 8, 2025

AP న్యూస్ రౌండప్

image

☛ కళ్యాణదుర్గంలో భక్త కనకదాసు జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి లోకేశ్.. తమ జీవితాంతం అనంతపురం నేలకు రుణపడి ఉంటామని హామీ
☛ తిరువూరు వివాదం.. CBNకు TDP క్రమశిక్షణ కమిటీ నివేదిక
☛ వివేకా హత్య కేసులో దోషులను జగన్ వెనకేసుకొస్తున్నారు: ఆదినారాయణ రెడ్డి
☛ ప్రభుత్వంపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో సీదిరి అప్పలరాజుకు నోటీసులు.. కాశీబుగ్గ PSలో 3గంటలుగా ప్రశ్నిస్తున్న పోలీసులు

News November 8, 2025

ఇతిహాసాలు క్విజ్ – 60 సమాధానాలు

image

1. కృష్ణుడి మొదటి గురువు ‘సాందీపని’.
2. కృష్ణుడు పెరిగిన వనాన్ని ‘బృందావనం’ అని అంటారు.
3. నాగులకు తల్లి ‘కద్రువ’.
4. కుంభకర్ణుడి నిద్రకు కారణమైన దేవుడు ‘బ్రహ్మ’.
5. స్కందుడు అంటే ‘కుమారస్వామి’.
<<-se>>#Ithihasaluquiz<<>>