News August 28, 2024
వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. స్థానికుల వివరాలు.. పామిరెడ్డిపల్లికి చెందిన బోయ అశోక్, బోయ చందు బైక్‌పై వనపర్తికి వెళ్తుండగా.. పామిరెడ్డిపల్లి స్టేజ్ వద్ద వనపర్తి డిపోకు చెందిన బస్సును ఢీ కొన్నారు. ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
Similar News
News March 21, 2026
పాలమూరు:GET READY.. నేడే రంజాన్

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా పవిత్ర రంజాన్ (ఈద్-ఉల్- ఫితార్) మాసం నేపథ్యంలో సామూహిక ప్రార్థనల (నమాజ్) కోసం ఈద్గా, మస్జీద్ ల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈద్ నమాజ్ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముస్లింలు గత నెలరోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు, ప్రతిరోజు ఐదు పూటలా నమాజ్, ప్రత్యేక తరావీ నిర్వహించారు. రంజాన్ పండుగ నేపథ్యంలో నేడు సందడి నెలకొననుంది.
#ఈద్ ముబారక్
News March 20, 2026
MBNR: రంజాన్ ఎంతో పవిత్రమైనది: ఎస్పీ

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ డి.జానకి ముస్లింలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ అందరి జీవితాల్లో ఆనందం, శాంతిని నింపాలని ఆమె ఆకాంక్షించారు. ఉపవాస దీక్షల ద్వారా పొందే ఆత్మశుద్ధి, సహనం, సేవాభావం సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని ఈ సందర్భంగా ఎస్పీ పేర్కొన్నారు.
News March 20, 2026
MBNR: రంజాన్.. బందోబస్తు ఏర్పాట్లపై నిఘా

మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి ఆదేశాల మేరకు శుక్రవారం పట్టణంలోని ఇద్గా వక్ఫ్-ఎ-రహ్మానియా వద్ద అదనపు ఎస్పీ ఎన్.బి.రత్నం బందోబస్తు ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. ఈద్ ఉల్ ఫితర్ నమాజ్‌కు భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరుకానున్న నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఇజాజుద్దీన్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


