News August 28, 2024

శ్రీకాకుళం: ఈ నెల 30న వన మహోత్సవం

image

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈనెల 30వ తేదీన వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శ్రీకాకుళ నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, విశిష్ట అతిథిగా రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, సభాధ్యక్షులుగా స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ హాజరవుతారని తెలిపారు.

Similar News

News March 18, 2026

మెక్సికోలో సిక్కోలు యువకుడి మృతి

image

గార మండలం అంపోలు గ్రామానికి చెందిన నాగుబిల్లి వెంకట ధర్మారావు(28) అనే యువకుడు మెక్సికోలో మృతిచెందినట్లు అక్కడి వారు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఇంజినీరింగ్ విద్యను అభ్యసించిన యువకుడు కొన్నేళ్లుగా మెక్సికోలో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం రాత్రి తాను ఉండే రూమ్‌లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. అతడి తల్లిదండ్రులు మంగళగిరిలో వలస కూలీలుగా ఉన్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News March 18, 2026

శ్రీకాకుళం: చెరువులో వ్యక్తి మృతదేహం లభ్యం

image

బూర్జ గ్రామానికి చెందిన పీ.వీరమల్లేశ్వరరావు(65) చెరువులో పడి మృతిచెందాడు. పోలీసులు వివరాలు మేరకు.. ఈనెల 5వ తేదీన అయ్యవారిపేటలో జరుగుతున్న అమ్మవారి పండగల్లో డ్యాన్స్ ప్రోగ్రాం చూసేందుకు వెళ్లిన వీరమల్లేశ్వరరావు తిరిగి ఇంటికి రాలేదు. మంగళవారం తోటాడ గ్రామంలోని చెరువులో ప్రమాదవశాత్తు పడిపోవడంతో మృతిచెందినట్లు కుటుంబసభ్యులు గుర్తించారు. ఘటనపై బూర్జ పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 18, 2026

శ్రీకాకుళం: జిల్లా రెవెన్యూ అధికారిగా విశ్వేశ్వరరావు నియామకం

image

శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అధికారిగా వీ.విశ్వేశ్వరరావును నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏలూరు డీఆర్‌వోగా విధులు నిర్వహిస్తున్న విశ్వేశ్వరరావును శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అధికారిగా బదిలీ చేస్తూ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జీ.సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నూతనంగా బాధ్యతలు చేపట్టనున్నారు.