News August 28, 2024
అందుకే నటాషాతో బ్రేకప్ అయ్యింది: అలీ గోని

భారత క్రికెటర్ హార్దిక్ నుంచి విడిపోయిన నటాషా అంతకుముందు నటుడు, మోడల్ అలీ గోనితోనూ డేటింగ్ చేశారు. అయితే తాము విడిపోవడానికి గల కారణాన్ని గోని తాజాగా వెల్లడించారు. ‘నటాషా నా కుటుంబంతో ఉండేందుకు ఇష్టపడలేదు. వేరుగా ఉందామని నాతో చెప్పింది. నేను నా కుటుంబాన్ని వదిలిపెట్టలేనని చెప్పాను. అందువల్లే మేం విడిపోవాల్సి వచ్చింది’ అని ఆయన ఓ ఇంటర్వ్యూలో వివరించారు. నటాషా-గోని ఓ డాన్స్ షోలో కలిసి పాల్గొన్నారు.
Similar News
News July 5, 2025
డీఎస్సీ నియామక ఉత్తర్వులపై ఆదేశాలు

AP: ఆగస్టు నాటికి డీఎస్సీ నియామక ఉత్తర్వులు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని మంత్రి లోకేశ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్య, సమగ్ర శిక్ష, ఉన్నత విద్యాశాఖల ఉన్నతాధికారులతో ఉండవల్లి నివాసంలో ఆయన సమీక్షించారు. డిగ్రీ విద్యార్థులపై భారం తగ్గేలా UGC నిబంధనలకు అనుగుణంగా సబ్జెక్టుల ఎంపిక ఉండేలా చూడాలని సూచించారు. 2024-25కి సంబంధించి ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.
News July 5, 2025
జులై 5: చరిత్రలో ఈరోజు

1906: నిర్మాత, దర్శకుడు ఘంటసాల బలరామయ్య జననం
1927: రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజ జననం
1980: సినీ నటుడు కళ్యాణ్‌రామ్ జననం(ఫొటోలో)
1995: బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు జననం(ఫొటోలో)
2017: సంఘసేవకురాలు కంచర్ల సుగుణమణి మరణం
అంతర్జాతీయ సహకార సంఘ దినోత్సవం
News July 5, 2025
గ్రేట్.. 5వేల మందికి ఉచితంగా ప్రసవాలు

చదువుకోకపోయినా రూపాయి తీసుకోకుండా ఇప్పటివరకూ 5వేల ప్రసవాలు చేశారు రాజస్థాన్ అజ్మీర్‌కు చెందిన 80ఏళ్ల సువా దై మా. దాదాపు 50 ఏళ్లుగా 6 గ్రామాల ప్రజలకు ప్రాథమిక వైద్యం అందిస్తున్నారు. తన అనుభవం, జ్ఞానంతో మహిళ నాడిని చెక్ చేసి గర్భధారణను ఆమె నిర్ధారిస్తుంటారు. తుఫానులొచ్చినా, అర్ధరాత్రైనా, కరెంట్ లేకున్నా ప్రసవాలు చేసేందుకు ముందుంటారు. ఆమె డబ్బును తీసుకోకుండా ఆశీర్వాదాలను మాత్రమే అంగీకరిస్తుంటారు.