News August 28, 2024
జై షా గ్రేటెస్ట్ ఆల్‌రౌండ్ క్రికెటర్.. ప్రకాశ్ రాజ్ సెటైర్లు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికవడంపై నటుడు ప్రకాశ్ రాజ్ సెటైర్లు వేశారు. ‘గ్రేటెస్ట్ లెజెండ్‌కు అందరూ స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వాలి. ఇండియా తయారు చేసిన బ్యాటర్, బౌలర్, వికెట్ కీపర్, ఫీల్డర్.. అత్యుత్తమ ఆల్‌రౌండ్ క్రికెటర్ ఇతడు. ఐసీసీ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు అభినందనలు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News January 31, 2025
తెలుగు నిర్మాత కన్నుమూత
టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్(54) ఇవాళ ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన HYDలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వేదరాజు సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అల్లరి నరేశ్‌తో మడత కాజా, సంఘర్షణ చిత్రాలను నిర్మించారు. మరో మూవీకి సన్నాహాలు చేసుకుంటుండగా ఈ దుర్ఘటన జరిగింది.
News January 31, 2025
పంచాయతీ ఎన్నికలు.. ఓటర్ల జాబితాపై SEC కీలక ఆదేశాలు
TG: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. గ్రామాల్లో వార్డుల వారీగా ఓటరు జాబితాను అప్డేట్ చేయాలని అధికారులను ఆదేశించింది. గత ఏడాది OCT 1 నుంచి DEC 31 వరకు జాబితా ఉండగా, ఫిబ్రవరి 3 వరకు సప్లిమెంటరీ లిస్టు రెడీ చేయాలని సూచించింది. ఓటర్ల తొలగింపు, చేర్పులపై ఫిబ్రవరి 4న స్థానిక రాజకీయ నాయకులతో భేటీ నిర్వహించాలంది. ఫిబ్రవరి 6 నాటికి తుది జాబితాను ఖరారు చేయాలని పేర్కొంది.
News January 31, 2025
మరింత యంగ్‌గా కనిపించాలనుకుంటున్నారా?
మన జీవితంలో కొన్ని అలవాట్లు పాటిస్తే అందంగా, ఆరోగ్యంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజూ తగినంత నీరు తాగాలి. మనం తినే ఆహారాన్ని (మైండ్‌ఫుల్ ఈటింగ్) ఆస్వాదిస్తూ తినాలి. కాసేపు స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి హాయిగా నవ్వుకోవాలి. స్వచ్ఛమైన గాలి పీలుస్తూ ప్రకృతిని ఆస్వాదించాలి. ప్రతిరోజూ 8 గంటలు నిద్రపోవాలి. రోజూ డాన్స్, యోగా, వ్యాయామం చేస్తే శరీరం చురుగ్గా పనిచేసి నిత్య యవ్వనంగా కనిపిస్తాం.