News August 28, 2024
ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలకు ఏర్పాట్లు

ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3 నుంచి 12 వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి. అక్టోబర్ 3న బాలా త్రిపుర సుందరీదేవిగా, 4న గాయత్రి దేవిగా, 5న అన్నపూర్ణ దేవిగా 6న లలిత త్రిపుర సుందరిదేవిగా, 7న. మహా చండీగ, 8న మహాలక్ష్మి దేవిగా. 9న సరస్వతిదేవిగా. 10న దుర్గాదేవిగా, 11న మహిషాసురమార్థని. 12న. రాజరాజేశ్వరి దేవిగా అలంకరిస్తారు. భక్తులకు ఇబ్బంది లేకుండా పటిష్ట ఏర్పాట్లను చేస్తున్నట్లు ఈవో రామారావు తెలిపారు.
Similar News
News March 14, 2026
కృష్ణా: విధుల పట్ల నిర్లక్ష్యం.. సస్పెండ్, షోకాజ్ నోటీసులు

విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై కృష్ణా జిల్లా కలెక్టర్ కఠిన చర్యలు చేపట్టారు. పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డోకిపర్రు గ్రామ పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్–2) రజియా సుల్తానాను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా జనాభా లెక్కల శిక్షణ కార్యక్రమానికి హాజరు కాని వడ్లమన్నాడు సచివాలయ డేటా అసిస్టెంట్ కె. సురేంద్రకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
News March 13, 2026
గన్నవరం: మంచుతో విమాన రాకపోకలకు అంతరాయం

గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో శుక్రవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. విజిబిలిటీ తీవ్రంగా తగ్గిపోవడంతో విమానాల రాకపోకలు అంతరాయం కలిగాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ నుంచి రావాల్సిన విమానాలు కొంతసేపు గాల్లోనే చక్కర్లు కొట్టాయి. పరిస్థితి మెరుగుపడిన తర్వాతే విమానాల ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వడం జరిగిందని అధికార వర్గాలు వెల్లడించారు.
News March 13, 2026
కృష్ణాజిల్లాలో రేపు సెలవు రద్దు

కృష్ణా జిల్లాలోని విద్యా సంస్థలకు ఈ నెల 14న రెండో శనివారం శెలవు రద్దు చేసినట్టు జిల్లా విద్యాశాఖాధికారి యువీ సుబ్బారావు గురువారం తెలిపారు. మొంథా తుపాన్ సమయంలో కాంపస్ శాటరీ శెలవుల దృష్ట్యా ఈ శనివారం పాఠశాలలకు శెలవు దినం రద్దు చేసినట్లు వివరించారు. ఆ రోజు అన్ని విద్యా సంస్థలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని డీఈఓ కోరారు.


