News August 29, 2024
ఈరోజు నమాజ్ వేళలు

తేది: ఆగస్టు 29, గురువారం
ఫజర్: తెల్లవారుజామున 4:48 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:02 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:17 గంటలకు
అసర్: సాయంత్రం 4:43 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:32 గంటలకు
ఇష: రాత్రి 7.46 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు
Similar News
News January 30, 2026
నేడే TG EAPCET-2026 షెడ్యూల్?

తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే EAPCET(గతంలో ఎంసెట్)-2026 షెడ్యూల్‌ను JNTU ఇవాళ విడుదల చేసే అవకాశం ఉంది. ఫిబ్రవరి 19 లేదా 20న నోటిఫికేషన్, మార్చి తొలి వారంలో అప్లికేషన్లు ప్రారంభం అవుతాయని తెలుస్తోంది. కాగా మే 4,5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ, మే 9,10,11 తేదీల్లో ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు.
News January 30, 2026
బంగారం డిమాండ్ తగ్గుతోంది: WGC

బంగారం ధర ఎఫెక్ట్ డిమాండ్‌పై పడింది. వివాహాల సీజన్ అయినా కొనుగోళ్లు పెరగకపోవడమే ఇందుకు ఉదాహరణ. గతేడాదితో పోలిస్తే ఈసారి డిమాండ్ తక్కువేనని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. 2024లో 802.8 టన్నుల అమ్మకాలు జరగ్గా 2025లో 11% తగ్గి 710.9 టన్నులకు చేరింది. ఈ ఏడాది అది 600-700 టన్నులే ఉండొచ్చని WGC అంచనా వేసింది. 2024లో కొనుగోళ్ల విలువ రూ.5.75లక్షల కోట్లు కాగా 2025లో అది రూ.7.51లక్షల కోట్లకు చేరింది.
News January 30, 2026
ఈ హైబ్రిడ్ కొబ్బరి రకాలతో అధిక ఆదాయం

☛ వైనతేయ గంగ: నాటిన 3-4 ఏళ్లలో కాపునకు వస్తుంది. ఏటా చెట్టుకు 125 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 69 శాతం.
☛ వశిష్ట గంగ: నాటిన 3-4 ఏళ్లలో కాపునకు వస్తుంది. సగటున చెట్టుకు 125 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 69 శాతం.
☛ అభయ గంగ: నాటిన 4 ఏళ్లకు కాపునకు వస్తుంది. సగటున చెట్టుకు 135 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 72 శాతం. కొబ్బరి నూనెకు ఇది అనుకూలం.


