News August 29, 2024

జనాభా పెరుగుదల రేటు కన్నా ఆత్మహత్యల రేటు అధికం: రిపోర్ట్

image

భారత్‌లో ఏడాదికి సగటున జనాభా పెరుగుదల రేటు కన్నా స్టూడెంట్స్ సూసైడ్ రేటు ఎక్కువగా ఉన్నట్లు NCRB నివేదిక వెల్లడించింది. 2 దశాబ్దాలలో విద్యార్థుల ఆత్మహత్యలు 4% పెరిగినట్లు పేర్కొంది. MH, తమిళనాడు, MPలోనే ఈ సంఖ్య అత్యధికమని తెలిపింది. మానసిక పరిస్థితులు ఇతర అంశాలు కారణాలుగా ఉన్నాయంది. నియంత్రణకు విద్యార్థులకు కాలేజీల్లో క్రమబద్దమైన కౌన్సెలింగ్ వ్యవస్థను రూపొందించాల్సి ఉందని పలువురు సూచిస్తున్నారు.

Similar News

News December 26, 2024

సినీ సమస్యల పరిష్కారానికి క్యాబినెట్ సబ్ కమిటీ

image

TG: సినీ పరిశ్రమలో సమస్యల పరిష్కారంపై మంత్రివర్గ సబ్ కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. సినీ పెద్దలు లేవనెత్తిన అంశాలపై చర్చించి నిర్ణయించాలని సీఎం రేవంత్ సూచించారు. ఈ కమిటీలో ప్రభుత్వం నుంచి ఇద్దరు మంత్రులు, సినీ నిర్మాతలు ఉండే అవకాశముంది. మరోవైపు సీఎం ప్రతిపాదనలపై సినీ ఇండస్ట్రీ పెద్దలంతా కలిసి చర్చిస్తామని దిల్ రాజు తెలిపారు. ఇండస్ట్రీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

News December 26, 2024

హైదరాబాద్ ప్రపంచ సినీ రాజధాని కావాలి: నాగార్జున

image

TG: ఈరోజు రేవంత్‌తో జరిగిన భేటీలో సినీ పెద్దలు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ‘ప్రభుత్వం ప్రోత్సాహకాలిస్తేనే సినీ పరిశ్రమ ప్రపంచ స్థాయికి ఎదుగుతుంది. హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలి’ అని నాగార్జున అన్నారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించాలని రాఘవేంద్రరావు పేర్కొన్నారు. మరోవైపు సినిమా రిలీజ్ ఫస్ట్ డే ఎన్నికల ఫలితాల్లాగే ఉత్కంఠగా ఉంటుందని మురళీమోహన్ తెలిపారు.

News December 26, 2024

సినీ పెద్దలకు సీఎం రేవంత్ షాక్

image

TG: మూవీ ఇండస్ట్రీకి కీలకమైన బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపుపై సినీ ప్రముఖులకు నిరాశే ఎదురైంది. ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. CM నిర్ణయం పట్ల ఇండస్ట్రీ పెద్దలు నిరాశ చెందినట్లు సమాచారం. రూ.వందల కోట్లతో తెరకెక్కిన సినిమాలకు బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు లేకపోవడం పెద్ద దెబ్బేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.