News August 29, 2024
ద్వారకాతిరుమల: ప్రసాదంలో పురుగు ఘటనపై చర్యలు

ద్వారకాతిరుమల చిన వెంకన్న ప్రసాదంలో పురుగు కనిపించడంపై ఏలూరుకు చెందిన ఆహార విభాగం అధికారులు ఆలయ ప్రసాదాల తయారీ కేంద్రంలో బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈవో వేండ్ర త్రినాథరావు సైతం స్పందించారు. సంబంధిత గుత్తేదారు రవికి నోటీసులు జారీ చేశారు. అలాగే ఆ విభాగం ఏఈవో, సూపరింటెండెంట్, ఇతర సిబ్బందికి సంజాయిషి నోటీసులు ఇచ్చినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Similar News
News February 21, 2026
నరసాపురం: గాల్లో ఎగురుతూ కరెంటు పనులు!

నరసాపురంలో విద్యుత్ శాఖ శనివారం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. డ్రోన్ల సాయంతో 11 KV విద్యుత్ వైర్లను బిగించే పనులను అధికారులు విజయవంతంగా నిర్వహించారు. 10 మంది కార్మికులు చేయాల్సిన కఠినమైన పనిని, డ్రోన్ సాయంతో కేవలం ఇద్దరు కార్మికులు పూర్తి చేశారు. దీనివల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా, కార్మికులకు భద్రత పెరిగిందని ఈఈ మధుకుమార్ తెలిపారు.
News February 21, 2026
భీమవరం: పంట కాలువలోకి దూసుకెళ్లిన బస్సు

భీమవరం మండలం యనమదుర్రులోని సూర్యమిత్ర ఫ్యాక్టరీ వద్ద శనివారం ప్రమాదం జరిగింది. సదరు ఫ్యాక్టరీకి చెందిన బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్సు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సూర్యమిత్ర ఫ్యాక్టరీ బస్సుగా దీన్ని గుర్తించినట్లు గ్రామస్థులు తెలిపారు. పోలీసులు విచారణ చేపట్టారు.
News February 21, 2026
ప.గో: శ్రీవారి ఫొటోలతో ప్లకార్డులు.. MLA నాయకర్ ఫైర్

శాసన మండలిలో YCP ఎమ్మెల్సీలు శ్రీవారి చిత్రపటాలను ప్లకార్డుల్లా వాడుతూ, చెప్పులేసుకుని వాటిని విసిరేయడంపై నరసాపురం MLA బొమ్మిడి నాయకర్ శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో MLA బొలిశెట్టితో కలిసి ఆయన మాట్లాడారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన YCPకి ప్రజా క్షేత్రంలో ఉండే అర్హత లేదన్నారు. దేవుడి చిత్రపటాలను అవమానిస్తూ పాపానికి ఒడిగట్టారని మండిపడ్డారు.


